Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నార్వే అత్యున్నత ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నార్వే అత్యున్నత ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


నార్వే ఐదవ రాజు  కింగ్ హెరాల్డ్ ఈ రోజు ఓస్లోలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇది విదేశీ ప్రభుత్వ అధినేతలకు నార్వే దేశం అందించే అత్యున్నత గౌరవం.  నార్వే దేశ ప్రయోజనాలకు, మానవాళికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గొప్ప పురస్కారాన్ని అందించినందుకు నార్వే రాజుకు, ఆ దేశ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్, నార్వే దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక స్నేహానికి  ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఇది భారత్, నార్వే దేశాల ప్రజల మధ్య చిరకాలంగా ఉన్న ఆత్మీయత, నమ్మకం, అనురాగానికి దక్కిన గుర్తింపు అని శ్రీ మోదీ అభివర్ణించారు.

ఈ పురస్కార ప్రదానం భారత్, నార్వే దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన సుహృద్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఇరు దేశాల స్నేహపూర్వక ప్రయాణానికి,  పరస్పర సహకారానికి  ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. 

***