Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాలుగు ఔషధ రంగ పిఎస్ యు ల మిగులు భూమిని అవసరాల మేరకు విక్రయించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


హిందుస్తాన్ యాంటీ బయోటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఎ ఎల్), ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐ డి పి ఎల్), రాజస్థాన్ డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ (ఆర్ డి పి ఎల్), మరియు బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (బి సి పి ఎల్)ల మిగులు భూమిని ఆయా సంస్థలు చెల్లించవలసిన అప్పులను తీర్చడం కోసం అవసరాన్ని బట్టి విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ విధంగా జాతీయ ఆస్తులను దేశ ఉత్తమ హితం కోసం వినియోగించడం జరుగుతోంది.

ప్రభుత్వ ఏజెన్సీలకు బహిరంగ స్పర్ధాత్మక బిడ్డింగ్ ద్వారా ఈ విక్రయాన్ని పూర్తి చేస్తారు. విక్రయం నుండి అందే మొత్తాలను చెల్లించవలసివున్న బకాయిలను తీర్చడం కోసం వినియోగిస్తారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వి ఆర్ ఎస్) / స్వచ్ఛంద వేర్పాటు పథకం (వి ఎస్ ఎస్)లను కూడా అమలుపరుస్తారు.

ఇంకా మిగిలి వుండే భూమిని పెట్టుబడి, ప్రజా ఆస్తుల నిర్వహణా విభాగం (డి ఐ పి ఎ ఎమ్), డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డి పి ఇ) మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.

అప్పులను తీర్చివేసిన అనంతరం ఐ డి పి ఎల్ ను, ఆర్ డి పి ఎల్ ను మూసివేసేందుకు అవసరమైన చర్యలు చేపడతారు. హెచ్ ఎ ఎల్ మరియు బి సి పి ఎల్ ల విషయంలో వ్యూహాత్మక విక్రయం తాలూకు ఐచ్ఛికాన్ని అన్వేషించడం జరుగుతుంది. ఈ సంస్థల పరిపాలక విభాగమైన ది డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ కాల బద్ధ అనుశీలన చర్యలను చేపడుతుంది.