Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాలుగు నూత‌న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ల కోసం డైరెక్ట‌ర్ పోస్టులు


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నెల‌కొల్పుతున్న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ ఐడి) ల కోసం నాలుగు డైరెక్ట‌ర్ పోస్టుల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. కురుక్షేత్ర (హ‌ర్యానా), భోపాల్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌), జోర్‌హాత్ (అస్సాం), విజ‌య‌వాడ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)ల‌లో ఎన్ ఐడిల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే.
జీతాలు, ఇత‌ర‌త్రా ఆర్థిక అంశాల‌పైన గ‌తంలోనే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఇది నేప‌థ్యం…

2007 ఫిబ్ర‌వ‌రిలో కేంద్ర కేబినెట్ నేష‌న‌ల్ డిజైన్ పాల‌సీని ఆమోదించింది. ఇందులో భాగంగా అహ్మ‌దాబాద్‌లో ఉన్న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ త‌ర‌హాలోనే దేశంలో మ‌రో నాలుగు ఎన్ ఐడిలను ఏర్పాటు చేయాల‌ని కేబినెట్ గ‌తంలో సంక‌ల్పించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో డిజైన్ రంగంలో నాణ్య‌మైన విద్య‌ను అందించడానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది.