Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిఘా జాగృతి వారం ముగింపు ఉత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి

నిఘా జాగృతి వారం ముగింపు ఉత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన నిఘా జాగృతి వారం ముగింపు ఉత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకత్వాన్ని తీసుకురావడంలోను, అవినీతిని నిరోధించడంలోను సాంకేతిక విజ్ఞానం ప్రముఖమైన పాత్రను పోషించవలసి ఉందన్నారు.

ప్రభుత్వం విధానాల ఆధారంగా సాగాలని ప్రధాన మంత్రి అన్నారు. పనులు వ్యక్తుల ఇష్టం, చాదస్తాలపై ఆధారపడి ఉండజాలవు అని ఆయన చెప్పారు.

చట్టాలను, విధానాలను రూపొందించేటపుడు విస్తృత‌ శ్రేణి ఉత్పాదకాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రధానం అని ప్రధాన మంత్రి అన్నారు.