Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిర్మాణం, కూల్చివేతల రంగంలోని వ్య‌ర్థాల రీసైక్లింగ్ లో కేంద్ర ప్ర‌జా ప‌నుల విభాగం, నార్వేకు చెందిన ఎస్ ఐ ఎన్ టీ ఈ ఎఫ్ ల మ‌ధ్య అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం


భార‌త‌దేశంలో నిర్మాణం, కూల్చివేతల రంగం (సీ అండ్ డీ) లోని వ్య‌ర్థాల రీసైక్లింగ్ లో శాస్త్రీయ ప‌రిశోధ‌న‌లు, హ్యూమ‌న్ రిసోర్స్ కెపాసిటీ బిల్డింగ్ అభివృద్ధిప‌ర‌చ‌డానికి కేంద్ర ప్ర‌జా ప‌నుల విభాగం (సీ పీ డ‌బ్ల్యు డీ), నార్వేకు చెందిన ఎస్ ఐ ఎన్ టీ ఈ ఎఫ్ ల మ‌ధ్య స‌హ‌కారం కోసం కుదిరిన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎంఓయూ) కు కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు.

నేప‌థ్యం:
ప‌రిశుభ్ర‌మైన భార‌త్ అనే ల‌క్ష్య సాధ‌న కోసం గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి 2014, అక్టోబ‌ర్ 2న “స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్” పేరుతో ఒక భారీ ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించారు.
భార‌త‌దేశంలో నిర్మాణ ప‌రిశ్ర‌మలో యేటా దాదాపు 10-12 మిలియ‌న్ ట‌న్నుల వ్య‌ర్థాలు వెలికి వ‌స్తున్నాయి. అంతేకాకుండా గృహ నిర్మాణం, రోడ్డు మార్గాల రంగాల‌లో యాగ్రిగేట్స్ కు త‌గ‌ని గిరాకీ ఉంది. అయితే గిరాకీకి, స‌ర‌ఫ‌రాకు మ‌ధ్య గ‌ణ‌నీయ‌మైన అంత‌రం ఉంది. సీ అండ్ డీ వ్య‌ర్థాల‌ను రీసైకిల్ చేయ‌డం ద్వారా ఈ అంత‌రాన్ని కొంత‌వ‌ర‌కు త‌గ్గించే వీలు ఉంది. ఇటుక‌లు, చెక్క‌లు, లోహం త‌దిత‌ర కొన్ని వ‌స్తువుల పున‌ర్ వినియోగం, రీసైక్లింగ్ చోటు చేసుకుంటున్నప్ప‌టికీ కాంక్రీటు, రాతి ప‌నిలో జ‌నించే వ్య‌ర్థాల (సీ అండ్ డీ వేస్ట్‌) లో దాదాపు 50 శాతం ప్ర‌స్తుతం భార‌త్ లో రీసైక్లింగ్ కు నోచుకోవ‌డం లేదు.