Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిస్వార్థ సేవ, కరుణ భావననూ


నిస్వార్థ సేవా భావనతో చేసే పనే సిసలైన మానవత్వమని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. అలాంటి పనులు మనసుకు సంతోషాన్ని కలిగించడంతో పాటు, సమాజ సంక్షేమానికీ తోడ్పాటును అందిస్తాయని ఆయన తెలిపారు.
‘‘
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహశ్చ దానం చ శీలమేతత్ప్రశస్యతే’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి  పంచుకున్నారు.

ఏ జీవి పట్ల అయినా సరే, మనస్సుతో, వాక్కుతో, కర్మల పరంగా ద్వేషాన్ని పెంచుకోకూడదు. అన్నిటి పట్ల కరుణ భావనతో మెలగాలి. ఉదార బుద్ధితో దానం చేయాలి. ఈ కార్యాలను అత్యున్నత నడవడికగా గుర్తించాలనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు ఇస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘
నిస్వార్ధ బుద్ధితో చేసిన పనే నిజమైన మానవత అనిపించుకుంటుంది. దీంతో అంతరంగానికి ఆనందం కలుగుతుంది. సమాజానికి కూడా మేలు జరుగుతుంది.
‘‘
అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహశ్చ దానం చ శీలమేతత్ప్రశస్యతే’’ అని పేర్కొన్నారు.

***