Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు ప్రధానమంత్రి అభినందనలు


నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

వివిధ అంశాలపై వారికిగల సంపూర్ణ అవగాహన, అపార అనుభవం విధాన రూపకల్పనను ఎంతో బలోపేతం చేయగలవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని రంగాల్లోనూ ఆవిష్కరణలను, పురోగమనాన్ని ఉజ్వల భవిష్యత్‌ దిశగా నడపడంలో వారి కృషి తోడ్పడుతుందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. వారి పదవీకాలం ఆద్యంతం ప్రభావశీలం, పరిణామాత్మకంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“నీతి ఆయోగ్ శాశ్వత సభ్యులుగా నియమితులైన డాక్టర్ శ్రీ ఆర్.బాలసుబ్రమణియం, డాక్టర్ శ్రీ జోరామ్ అనియాలకు నా హృదయపూర్వక అభినందనలు. వివిధ అంశాలపై వారికగల లోతైన అవగాహన, అపార అనుభవం విధానాల రూపకల్పనను మరింత బలోపేతం చేయగలవు. వారి కృషి అన్ని రంగాల్లో ఆవిష్కరణలతోపాటు పురోగమనానికి సారథ్యం వహిస్తుందని విశ్వసిస్తున్నాను. వారి పదవీకాలం ఆద్యంతం ప్రభావశీలం, పరిణామాత్మకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***