Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నూత‌న‌ మరియు నవీకరణయోగ్య శ‌క్తి రంగం లో భార‌త‌దేశం, ఫ్రాన్స్ ల‌ మధ్య అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


భార‌త‌దేశ సౌర శ‌క్తి సంస్థ సోలార్ ఎన‌ర్జీ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఎస్ ఇసిఐ), ఫ్రాన్స్ కు చెందిన ప‌రిశోధ‌నా సంస్థ‌ Commissariat a l energieatomique et aux energies alternatives (సిఇఎ), ఫ్రెంచ్ కంపెనీ బ్లూస్టోరేజ్ ఎస్ఎఎస్ లకు మ‌ధ్య‌ అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రాన్ని (ఎంఒయు ను) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం దృష్టి కి తీసుకురావడమైంది. ఈ ఎంఒయు పైన ఈ సంవత్సరం అక్టోబ‌ర్ 3వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలయ్యాయి. హిందీ, ఇంగ్లిషు, ఫ్రెంచ్ భాష‌ల్లో ప్రతి ఒక్క మూల ప్రతి పైన సంత‌కాలు చేయ‌డం జ‌రిగింది.

ఉభయ దేశాల మ‌ధ్య‌ ఈ రంగానికి సంబంధించిన భవిష్యత్తు విధి విధానాల చ‌ర్చ‌ ల‌ను నిర్వ‌చించాలనేది ఈ ఎంఒయు ల‌క్ష్యం. మరీముఖ్యం గా ఎస్ ఇ సిఐ కి ఒక ఎల‌క్ట్రానిక్ వెహిక‌ల్ ఛార్జింగ్ స్టేశన్ ఏర్పాటు అనేది ఎంఒయు ధ్యేయం గా ఉంది. ఈ వాహ‌నాలు సోలార్ ప్యానెల్స్ ద్వారా ప‌ని చేసే ఎంబెడెడ్ బ్యాట‌రీ ల‌ను క‌లిగి వుంటాయి. అంతే కాదు ఈ ఎంఒయు తో విద్యుత్ గ్రిడ్ క‌నెక్ష‌న్ ను స‌మ‌ర్థ‌వంతం గా వాడుకోవ‌డం జ‌రుగుతుంది. సౌర‌ శ‌క్తి ని అధికం గా వాడుకోవ‌డం ద్వారా విద్యుత్తు గ్రిడ్ మీద భారం త‌క్కువ ప‌డేలా చూడాల‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌. విద్యుచ్ఛక్తి వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌ని ప్ర‌భుత్వం ఎంతో ఆస‌క్తి గా త‌యారు చేసిన ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంది.

భార‌త‌దేశం, ఫ్రాన్స్ ల మ‌ధ్య‌ గ‌ల ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ఈ ఎంఒయు మ‌రింత బ‌లోపేతం చేస్తుంది.