పిఎంఇండియా
నేపాల్ ప్రధాన మంత్రి శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’తో ప్ర ధాన మంత్రి శ్రీ
నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో సంభాషించారు.
భారత్-నేపాల్ ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 2023 మే 31 నుండి జూన్ 3 వరకు నేపాల్ ప్రధాన మంత్రి ప్రచండ భారత పర్యటన సందర్భంగా సందర్భంగా జరిగిన చర్చలకు కొనసాగింపుగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, , ఇరు దేశాల మధ్య లోతైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నేతలు సంభాషించారు.
సన్నిహిత, స్నేహపూర్వక పొరుగు దేశమైన నేపాల్ భారత్ ‘పొరుగుదేశాలకు ప్రథమం’ విధానంలో కీలక భాగస్వామి.
ఈ టెలిఫోన్ సంభాషణ ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమాచార మార్పిడి సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది.
*******
Pleased to have spoken with Prime Minister @cmprachanda of Nepal today. Building upon our fruitful talks in New Delhi on 1 June 2023, we are in agreement about the need to expedite the implementation of key decisions from our discussions. This will further strengthen the…
— Narendra Modi (@narendramodi) August 5, 2023