Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ సంభాషణ


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా తో ఫోన్ లో మాట్లాడారు.

నేపాల్ లో సంభవించిన హింసా కాండలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నరేంద్ర మోదీ, ఇటీవల సంభవించిన వరుస భూకంపాల వల్ల నేపాల్లో రాజకీయ, సామాజిక అనిశ్చితి ఏర్పడిందని అన్నారు.

శాంతి భద్రతలు సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, నేపాల్ ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు. ఇందుకు నేపాల్ ప్రజలు, ఆ దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలాని నరేంద్ర మోదీ అన్నారు.

శాంతి ప్రక్రియలో, రాజ్యాంగ నిర్మాణంలో నేపాల్ సాధించిన చారిత్రక పురోగతిని ప్రధాని కొనియాడారు.

నేపాల్ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యల్ని పరిష్కరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజలతో కలసి, విస్తృత చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గాల్ని అన్వేషించాలని, తద్వారా సమాజంలోని అన్ని వర్గాలలో సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని ప్రధాని ఆకాంక్షించారు.

పొరుగు దేశంగా నేపాల్ రక్షణకు భారతదేశం తనవంతు సహాయసహకారాల్ని అందిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

బలమైన సామాజిక విభిన్నత కల్గిన నేపాల్ దేశం శాంతి పూర్వక, ప్రజాస్వామ్య, రక్షిత, సుస్థిర, శ్రేయస్సుతో కూడిన దేశంగా ఎదిగేందుకు, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలు, తోడ్పాటును భారత ప్రభుత్వం అందిస్తుందని మోదీ తెలిపారు.