Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ ప్ర‌ధాని శ్రీ శేర్ బ‌హాదుర్ దేవ్ బా తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు నేపాల్ ప్ర‌ధాని శ్రీ శేర్ బ‌హాదుర్ దేవ్ బా తో టెలిఫోన్ లో మాట్లాడారు.

ఇటీవ‌ల నేపాల్ లో వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్రాణ న‌ష్టం వాటిల్లినందుకు ప్ర‌ధాన మంత్రి సంతాపం వ్య‌క్తం చేశారు. శాయ‌శ‌క్తులా స‌హాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా శ్రీ దేవ్ బా తో శ్రీ మోదీ అన్నారు.

******