Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేశ‌న‌ల్ కంపెనీ లా అపెలిట్ ట్రైబ్యూన‌ల్ లో అద‌నం గా మూడు జుడిశల్ మెంబ‌ర్ ల పోస్టు ల‌తో పాటు టెక్నిక‌ల్ మెంబ‌ర్ల పోస్టు లు మూడిటి ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


నేశ‌న‌ల్ కంపెనీ లా అపెలిట్ ట్రైబ్యూన‌ల్ (ఎన్‌సిఎల్ఎటి)లో అదనం గా జుడిశల్ మెంబ‌ర్ ల పోస్టు లు మూడిటి ని, అలాగే టెక్నిక‌ల్ మెంబ‌ర్ ల పోస్టులు మూడిటి ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ప‌ద‌వులు లెవెల్ 17 (2,25,000 రూపాయల నిర్ధారిత) మ‌రియు ఇతర మాన్య భ‌త్యాల తో ఏర్పాటు కానున్నాయి. దీని తో ప్ర‌తి ఒక్క సంవ‌త్స‌రం మొత్తం 2,27,82,096 రూపాయల (రెండు కోట్ల ఇరవై ఏడు లక్ష‌ల ఎనభై రెండు వేల తొంభై ఆరు రూపాయలు మాత్రమే) ఆర్థిక భారం ప‌డుతుంది.

వీటి తో ఎన్ సిఎల్ ఎటి.. ఫైనాన్స్ యాక్టు, 2017, కంపెనీస్ యాక్టు, ఐబిసి, 2016 ల‌ ప్రకారం లభించిన శాసనాదేశాన్ని.. పాటించవలసివస్తుంది. అలాగే నిర్దేశించిన గ‌డువు లోగా కేసుల ప‌రిష్కారాని కి పూచీపడవలసివుంటుంది.

******