పిఎంఇండియా
2019 నేశనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు సంబంధించిన సవరణలు/ మార్పుల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దృష్టి కి తీసుకురావడం జరిగింది. మెడికల్ కమిషన్ బిల్లు 2019 ఒరిజినల్ బిల్లు ను కేబినెట్ 2019 జూలై 17న ఆమోదించింది. దానిని పార్లమెంటు ఉభయసభలు అధికారిక సవరణల తో 2019 జూలై 29న, 2019 ఆగస్టు 1న ఆమోదం తెలిపాయి.
2019 జూలై 17న కేబినెట్ ఆమోదించిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు 2019 ను పార్లమెంటు కింది సవరణలతో ఆమోదించింది. ఈ సవరణలను కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది.
i. క్లాజు 4(1)(సి)- 14 మంది సభ్యులకు బదులుగా 22 మంది పార్ట్ టైమ్ సభ్యులు
ii. క్లాజు 4(4)(బి)- ఆరుగురు సభ్యులకు బదులుగా పదిమంది సభ్యులు
iii. క్లాజు4(4)(సి)- ఐదుగురు సభ్యులకు బదులుగా తొమ్మిది మంది సభ్యులు
iv. క్లాజు 37(2)- చివరన “టీచింగ్ ప్రయోజనం కోసం” కూడా అని చేర్చడం జరిగింది.
***