పిఎంఇండియా
నైపుణ్యాల అభివృద్ధి మరియు అర్హతల గుర్తింపులో సహకారం కోసం భారత దేశం, కతర్ ల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) పై సంతకాల ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
కతర్ లో నైపుణ్యాల అభివృద్ధి, శ్రామిక శక్తి పరివర్తనీయత మరియు విదేశీ ఉద్యోగాలలో యువత నియామకానికి ఈ ఎమ్ ఒ యు తోడ్పడగలదు.