Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకా సంబంధి రవాణాలో సంస్థాగత సహకారం అంశంపై భారత దేశానికి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


నౌకా సంబంధి రవాణాలో సంస్థాగత సహకారం అంశంపై భారత దేశానికి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.

నౌకా సంబంధ రవాణాను ప్రోత్సహించడానికి మరియు మార్గం సుగమం చేయడానికి, కస్టమ్స్ ఇంకా ఇతర లాంఛనాలను సులభతరంగా మార్చడానికి వ్యర్ధాల సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుత ఇన్ స్టలేషన్ లను వినియోగించుకోవడానికి ప్రతిపాదిత ఎమ్ఒయు దోహదం చేస్తుంది.

ఉభయ దేశాలలోని షిప్పింగ్ కంపెనీలు స్థిర ప్రాతిపదికన వ్యాపార కార్యకలాపాలను సాగించడం కోసం ద్వైపాక్షిక మరియు బహుళ పాక్షిక ఏర్పాట్లు చేసుకొనేందుకు ఈ ఎమ్ఒయు వీలు కల్పిస్తుంది.

***