Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యాయ రంగంలో భారతదేశం మరియు ట్యూనీశియా ల మధ్య సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


న్యాయ రంగంలో భారతదేశం మరియు ట్యూనీశియా ల మధ్య సహకారం కోసం అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భారతదేశం మరియు ట్యూనీశియా ల మధ్య సాంఘిక, సాంస్కృతిక మరియు వాణిజ్యపరమైన సంబంధాలు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా సకారాత్మకమైన దిశలో సాగుతున్నాయి. న్యాయ రంగంలో సహకారానికి ఒక ఒప్పందంపై సంతకాలు జరగడం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను మరింతగా పెంపొందింపచేయడంతో పాటు న్యాయ సంస్కరణల రంగంలో కూడా నూతన పార్శ్వాలను జోడించగలదు.

***