Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం


నమస్తే!

కియా ఒరా న్యూజిలాండ్!

మళ్లీ ఏ పుష్కరానికో…’ అంటుంటాం భారత్‌లో మనంగత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారిదీనిని నా అదృష్టంగా భావిస్తున్నానున్యూజిలాండ్ ప్రజలందరికీమీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.

మిత్రులారా,

ప్రధానమంత్రిగా న్యూజిలాండ్‌లో ఇది నా మొదటి పర్యటనే కావచ్చు. కానీ ఒక 25 – 30 ఏళ్ల కిందటేనేను ఏ ప్రభుత్వంలోనూ భాగంగా లేని సమయంలోనేప్రభుత్వ వ్యవహారాల్లో నా పేరు అంతగా ఎవరికీ తెలియని సమయంలోనే.. న్యూజిలాండ్‌లో పర్యటించే అవకాశం నాకు కలిగిందిఆ పర్యటన సమయంలో ఒక వ్యక్తి నాకు మూడు వస్తువులను బహూకరించారువాటిని నాతోపాటు భారత్‌కు తీసుకెళ్లానుఈ మఫ్లర్ఒక టోపీఒక జత గ్లౌలు నాకిచ్చారుఎందుకంటే అది చలి కాలం.

వాటిలో ఒకటి ఈ రోజుకూ నాతో ఉంది. మీకు కనిపిస్తున్న ఈ మఫ్లర్ 25 – 30 ఏళ్ల కిందట న్యూజిలాండ్‌లో ఓ మిత్రుడు బహూకరించినదేగత కొన్నేళ్లుగా నేను దీన్ని ఎన్నోసార్లు ఉపయోగించానుమీ ఆత్మీయతను నేనెంత విలువైనదిగా భావిస్తానో.. అలాగే దీన్ని కూడా ఈ రోజు వరకు జాగ్రత్తగా దాచుకున్నాను.

న్యూజిలాండ్‌ పర్యటన ఖరారవగానే.. దీన్ని తప్పక నా వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానుముఖ్యంగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుందని నాతో చెప్పారు.

మిత్రులారా,

ఎన్నో జ్ఞాపకాలు, మైత్రివిలువలుసమష్టి నిబద్ధతలు భారత్న్యూజిలాండ్ సంబంధాలకు ప్రాతిపదికలుగా ఉన్నాయిన్యూజిలాండ్ సంప్రదాయం ఈ సంబంధాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందిఒక పదం వందల ఏళ్లుగా ఇక్కడ ప్రజలను ఏకం చేసింది – ‘వాకా’అదొక పడవ మాత్రమే కాదు.. మన ఉమ్మడి ప్రయాణానికి చిహ్నంమరి ఈ రోజు ఈ భారత్ – న్యూజిలాండ్ మైత్రీనావ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

మనముందున్న మహాసముద్రం మనకెన్నో అవకాశాలనిస్తోందిఅనుకూలమైన గాలులు వీస్తున్నాయివిస్తృతమైన సముద్రపు అలలు మనకు తోడుగా ఉన్నాయిమన సమష్టి సంకల్పానికి ప్రతీకగా ఆ నీలి ఆకాశం మనకు అండగా ఉందిసాధించాల్సింది ఇంకెంతో ఉందిమనం గెలుస్తామని నాకు తెలుసు.

 

మిత్రులారా,

ఈ ప్రయాణం విజయవంతమవుతుందన్న గట్టి నమ్మకం నాకుందిఎందుకో తెలుసానరేంద్ర మోదీ కాదు.. మీ అందరి వల్లే అది సాధ్యమవుతుందిమీరే దీనికి చుక్కానిఅక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకుక్రైస్ట్‌చర్చ్ నుంచి క్వీన్స్‌టౌన్ వరకు… న్యూజిలాండ్ నలుమూలలా విస్తరించిన భారతీయ సమాజమంతా ఈ ప్రయాణంలో భాగమైంది.

మిత్రులారా,

ప్రసంగాన్ని కొనసాగించడానికి ముందు.. నా మిత్రుడున్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లగ్జాన్‌కూప్రభుత్వంలోని నా సహచరులకూఇక్కడికి విచ్చేసిన లేబర్ పార్టీ సభ్యులకూ నా అభివాదాలను తెలియజేస్తున్నాను.

 

భారత్ – న్యూజిలాండ్ సంబంధాల్లో బలమైన ద్వైపాక్షిక సహకారానికి వారి హాజరు నిదర్శనంన్యూజిలాండ్ లోని భారతీయ సమాజం సాధించిన విజయాలనూవారి కృషినీ ఇది చాటుతోందిమీ రాక ఈ కార్యక్రమానికి మరింత శోభను తెచ్చింది.

 

ఆత్మీయానురాగాలతో, ఎంతో ఉత్సాహంతో మాకు స్వాగతం పలికిన మీ అందరికీ కృతజ్ఞతలు.

 

గౌరవ మిత్రులారా.. కివీ భారతీయ సమాజంలో అనేక మందికి మీరెంతో అభిమానపాత్రులు కూడాభారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా.. ‘దమా దమ్ మస్త్ కలందర్’ పాటకు మీరుక్రిస్ హిప్‌కిన్స్ కలిసి చేసిన నృత్యం వైరల్ అయ్యిందిఆ నృత్యం కివీ భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

మిత్రులారా,

న్యూజిలాండ్ నిజంగా అద్భుతమైన దేశం. శాంతికీసంపదకూప్రకృతికీసంస్కృతికీ నిలయంఅయితే ప్రజలే ఈ దేశానికి గొప్ప బలంఒక దేశం అంకితభావంతోస్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే.. అది ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందని న్యూజిలాండ్ ప్రజలు నిరూపించారు.

ఇక్కడి కివీ భారతీయ సమాజాన్ని కూడా న్యూజిలాండ్ ప్రజలు ఆత్మీయానురాగాలతో అక్కున చేర్చుకున్నారు. వారు మిమ్మల్ని తమ టీంలో ఒకరిగా చేసుకున్నారుమీ ప్రతిభపైనామీ దార్శనికతపైనా వారు నమ్మకముంచారునేడు న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ అయినాసమాజమైనా.. ప్రతి రంగానికీ కివీ భారతీయులు వన్నె తెస్తున్నారు.

 

ఈ దేశంలో ఒక నిఖిల్ రవిశంకర్ ఎయిర్ న్యూజిలాండ్ సీఈవో కాగలరుఆనంద్ సత్యానంద్ గవర్నర్ జనరల్ కాగలరురచిన్ రవీంద్రఇష్ సోదిఅజాజ్ పటేల్ వంటి ప్రతిభావంతులకు జాతీయ క్రికెట్టు జట్టులో అవకాశాలూ లభిస్తాయి.

 

న్యూజిలాండ్‌లో రోడ్లు కూడా భారతీయ ప్రదేశాలను గుర్తుకు తెస్తాయిఖండాలాబాంబే హిల్స్కోరమాండల్ వంటి పేర్లు వాటికి ఉన్నాయి.

కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రిసెంట్అమృత్‌సర్ స్ట్రీట్ వంటి పేర్లతో చాలా వీధులు కూడా ఉన్నాయిఇక్కడ ఉంటూమీరు నిజంగానే కీవీలుగా మారిపోయారునేనొకటి విన్నానునిజానికిక్కడ ఏ అంశంతో సంభాషణ మొదలయినా.. కొద్దిసేపటికేఅనివార్యంగా అది వాతావరణ చర్చగా మారిపోతుందట కదా.

మిత్రులారా,

నేను న్యూజిలాండ్ నాయకులను కలిసిన ప్రతిసారీ మీ అందరి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ ప్రశంసలు మీకే అయినాఅవి నాకెంతో గర్వకారణం.

మిత్రులారా,

మీ అందరికీ తెలుసు.. భారత్‌ది వేల ఏళ్ల నాగరికతనేడు అది ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకుంటూనేఆధునికతను అందిపుచ్చుకుంటోందిప్రతి యుగంలోనూప్రతి చారిత్రక దశలోనూ.. భారత్ తనను తాను మలచుకుంటూ నిలిచిందిజ్ఞాన తృష్ణే దీనికి కారణం.

భారతీయులు అందరి దగ్గర్నుంచీ నేర్చుకుంటారు. వేరే దేశం జనసంఖ్య కాదు.. ప్రజా సంక్షేమానికి అది ఏ మేరకు కట్టుబడి ఉందన్నదే మనకు ముఖ్యంఅందుకే మనం న్యూజిలాండ్ నుంచి నేర్చుకున్నాంనేర్చుకుంటూనే ఉన్నాం.

ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటుహక్కును కల్పించిన దేశం న్యూజిలాండ్న్యూజిలాండ్ సమాజానికి మహిళలు ఎంత గొప్పగా సేవలందిస్తున్నారో నేడు మనం చూస్తున్నాం. ‘మహిళల నేతృత్వంలోని అభివృద్ధి’ అన్న దృక్పథంతో.. భారత్ కూడా మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది.

మిత్రులారా,

బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దేశ తలరాతను ఎలా మార్చగలదో న్యూజిలాండ్ నిరూపించింది. వ్యవసాయ రంగం చుట్టూ ఒక సమర్థమైన వ్యవస్థను నిర్మించుకోవడమే ఈ దేశానికి గొప్ప బలంపంట ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడం (ట్రేసబిలిటీ), ఆహార భద్రతనిబంధనల అమలు… ఈ వ్యవస్థలన్నీ మనకెంతగానో స్ఫూర్తినిస్తాయికోట్లాది మంది చిన్నసన్నకారు రైతులున్న భారత్ లాంటి ఒక పెద్ద వ్యావసాయిక దేశానికి ఇవి ముఖ్యమైన పాఠాలు.

చిన్న రైతులు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్లను నిర్మించవచ్చని జెస్ప్రీ నమూనాతో న్యూజిలాండ్ చూపించింది. అలాగే వాతావరణ మార్పులను తట్టుకుంటూ సాగే అక్కడి సునిశిత వ్యవసాయ సాంకేతికతల నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

మిత్రులారా,

 

ఇక్కడ మనుకా తేనెను ‘ద్రవ బంగారం’ అని పిలుస్తారున్యూజిలాండ్‌లో తేనెకు చాలా ప్రాధాన్యముందిసంప్రదాయమూరుచీ మాత్రమే కాదు.. ఆరోర్య రక్షణలో తేనెది ముఖ్య పాత్రభారత ఆయుర్వేద సంప్రదాయంలోనూ తేనెకు అలాంటి ప్రాధాన్యమే ఉందితేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి భారత్ కూడా ఒక జాతీయ మిషన్‌ను అమలు చేస్తుండడం మీకు సంతోషాన్నిచ్చే విషయందీంతో దేశంలో తేనె ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

ఈ రోజుల్లో హిమాలయ ఉన్నత శిఖరాల నుంచి లభించే తేనె.. బంగారం మాత్రమే కాదుఅది అంతకుమించిఅది వజ్రంతో సమానంతేనె ఉత్పత్తిని మరింత పెంచడం కోసం.. న్యూజిలాండ్ అనుసరిస్తున్న విధానాల నుంచి మనమెంతో నేర్చుకోవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను.

మిత్రులారా,

భారత్ – న్యూజిలాండ్ క్రీడా సంబంధాలకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయివందేళ్ల కిందట మన హాకీ జట్టు మ్యాచ్‌లు ఆడటానికి న్యూజిలాండ్ వచ్చిందినాటి పర్యటనలో మేజర్ ధ్యాన్ చంద్ అద్భుత ఆటతీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుందిఆయన హాకీ నైపుణ్యాలతో న్యూజిలాండ్ ప్రజల హృదయాలను సైతం గెలిచారు.

మిత్రులారా,

కంటెంట్ సృజనకారుల భాషలో చెప్పాలంటే.. ఇది కొలాబరేషన్ల కాలంక్రీడల్లో కూడా భారత్న్యూజిలాండ్ అద్భుతమైన కొలాబరేషన్లను ఏర్పరచుకోగలవురగ్బీ దానికి మంచి ఉదాహరణ.

 

కొద్దిసేపటి కిందట జరిగిన రగ్బీ మ్యాచ్‌లో ఆల్ బ్లాక్స్ (న్యూజిలాండ్అద్భుత విజయం సాధించిందని నాకిప్పుడే తెలిసిందిరగ్బీలో న్యూజిలాండ్ నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందిభారత్‌లో రగ్బీ అభివృద్ధి చెందాలంటే మనకు కోచ్‌లునిపుణులు అవసరంఈ విషయంలో న్యూజిలాండ్ విలువైన సహకారాన్ని అందించగలదున్యూజిలాండ్ రగ్బీ – రగ్బీ ఇండియా మధ్య ఇటీవల భువనేశ్వర్‌లో నిర్వహించిన కోచింగ్ కార్యక్రమం ఈ దిశగా ఒక మంచి ఆరంభం.

మిత్రులారా,

ఈ రోజు నేనిక్కడికి రావడానికి ముందు.. న్యూజిలాండ్‌లో ఒక స్పోర్ట్స్ స్టార్టప్ కార్యక్రమానికి హాజరయ్యానుక్రీడా సాంకేతికతలో సరికొత్త ఆవిష్కరణలువినూత్న ఆలోచనలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయిక్రీడా సాంకేతికత రంగంలో మనం కలిసికట్టుగా ఎన్నో అద్భుతాలు సాధించగలమన్న నమ్మకం నాకుంది.

భారత్, న్యూజిలాండ్ దేశాల భవితవ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందిఅంతరిక్ష రంగంలో మన సహకారం దీనికి ఒక చక్కని ఉదాహరణభారత ‘చంద్రయాన్’ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన వేళ.. ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని న్యూజిలాండ్ ప్రజలంతా వేడుకలా జరుపుకొన్నారుఇది మనందరికీ ఎంతో గర్వకారణం.

 

మరో విషయాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నానుఈ మహత్తర విజయంలో న్యూజిలాండ్ సాంకేతికత ఉపయోగపడిందిమీ అందరికీ గర్వకారణమైన మరో అంశంన్యూజిలాండ్‌కు చెందిన అంతరిక్ష సంస్థలు గతంలో పలు సందర్భాల్లో మనతో కలిసి పనిచేశాయిభవిష్యత్తులో ఈ అంతరిక్ష సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మనం కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

భారత్, న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఎంతటి అపారమైన అవకాశాలను ఇచ్చిపుచ్చుకోగలవో నిరూపించడానికి అంతరిక్ష రంగం ఒక్కటి సరిపోతుందిమన వాణిజ్య ఒప్పందం వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి కూడా ఇదేఈ వాణిజ్య ఒప్పందం వికసిత భారత్ దిశగా మన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుందిఅదే సమయంలో భారత్న్యూజిలాండ్ రెండు దేశాల్లోనూ వ్యాపార రంగానికి సరికొత్త అవకాశాలను అందిస్తుంది.

మిత్రులారా,

భారత్, న్యూజిలాండ్ మధ్య మరో ముఖ్యమైన పోలిక ఉందిమన మూల సంస్కృతులను గౌరవించుకోవడంలోదేశీయ వారసత్వాన్ని పరిరక్షించుకునిదానిని ఘనంగా చాటడంలో ఇరుదేశాలూ ఒకేలా ఆలోచిస్తాయి. ‘మావోరీ’ సమాజానికి ఈ వేదికపై నుంచి నా ప్రత్యేక అభివాదాలు తెలియజేస్తున్నాను.

వారి ‘హాకా’ను కేవలం ఒక ప్రదర్శనగా నేను చూడలేదు. ఆ హాకాలో ఆ సమాజపు ఆత్మ నాకు కనిపించిందివారి ధైర్యాన్నిఆత్మగౌరవాన్నిపూర్వీకుల పట్ల పూజ్యభావాన్నియావత్ సమాజపు సమష్టి శక్తిని అది అద్భుతంగా ఆవిష్కరించింది.

మిత్రులారా,

మావోరీ సంస్కృతిలో ఒక అందమైన పదముంది.. ‘మనాకితంగ’ఎదుటివారికి గౌరవం ఇవ్వడంఆత్మీయతను పంచడంమనస్ఫూర్తిగా వారిని ఆదరించడం… ఇదీ దాని అర్థంభారత్‌లో మనం కూడా అతిథి దేవో భవ అంటాంఅంటే అతిథి దేవుడితో సమానమని.

ఇక్కడ పదాలు వేరు కావచ్చు.. సందర్భాలు వేరు కావచ్చు.. వేషధారణలు వేరు కావచ్చు.. భాషలు కూడా వేరు కావచ్చు… కానీ ఆత్మీయత నిండిన ఆ భావన మాత్రం ఒక్కటే.

అదేవిధంగా మావోరీ సంస్కృతిలో కుటుంబానికి ఒక చక్కని పదం ఉంది.. ‘ఫా నౌ’.. అంటే కుటుంబమని అర్థంతరతరాల బంధాలుబంధుత్వాలుయావత్ సమాజమూ ఈ కుటుంబంలో భాగమవుతాయిభారత్‌లో కూడా మనం కుటుంబాన్ని కేవలం ఒక సామాజిక ఏర్పాటుగా కాకుండా.. ఒక గొప్ప వ్యవస్థగా చూస్తాం.

 

మిత్రులారా,

మావోరీ సంప్రదాయంలో ‘కైటియాకిటాంగా’ అనే మరో అందమైన భావన ఉంది. ప్రకృతికి మనం యజమానులం కాదనీదాని సంరక్షకులమనీ ఇది మనకు బోధిస్తుందిభారత్ కూడా అనాదిగా ఇదే తాత్వికతను అవలంబిస్తోంది: – ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’’అంటే, ‘‘ఈ భూమి మన తల్లినేను ఆమె పుత్రుడిని’’ఈ స్ఫూర్తితో ఏక్ పేడ్ మా కే నామ్సేంద్రియ వ్యవసాయ మిషన్ వంటి అనేక కార్యక్రమాలను భారత్ చేపట్టింది.

 

మిత్రులారా,

మీరు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నప్పటికీ.. మీ హృదయాల్లో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని నాకు తెలుసుమీ రోజువారీ జీవితంలో ఏదో ఒక రూపంలో భారత్ ఎప్పుడూ మీతోనే ఉంటుందిఅవునా కాదామీరు ఇక్కడ ఉండొచ్చు.. కానీమీ మనసంతా ఎక్కడుంది…అందుకే భారత్ సాధించే ప్రతి విజయాన్ని మీరెంతో నిశితంగా గమనిస్తుంటారు.

 

మీరు స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కొన్ని చిన్న విషయాలను గమనించలేకపోవచ్చుకానీ అదే మ్యాచ్‌ను ఇంట్లో టీవీలో చూస్తే.. ప్రతి చిన్న అంశాన్నీ స్పష్టంగా చూడగలుగుతాంఅలాగే భారత్‌లోని ప్రతి పరిణామంపై మీకు అవగాహన ఉంటుందిఅదే మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా నిలుపుతుంది.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తాము నివసిస్తున్న దేశాల ప్రగతికి తోడ్పడుతూనే… మాతృభూమి అభివృద్ధిలోనూ అంతే బలమైన పాత్రను పోషిస్తారు.

మిత్రులారా,

మన జన్మభూమిని.. అంటే మాతృభూమిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాంఅలాగే మనం పని చేస్తూ జీవితాలను నిర్మించుకునే కర్మభూమి పట్ల కూడా అదే అంకితభావంతో ఉంటాం.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్త సవాళ్ల నడుమ.. భారత్ నేడు సాధిస్తున్న పురోగతి వేగం నిజంగా అపూర్వమైనదిభారత్ సామర్థ్యాలను ప్రతిబింబించేలా.. దేశం సాధించిన విజయాల సమాహారాన్ని మీకు వివరించేందుకు ప్రయత్నిస్తానుఈ విజయ హారాన్ని ప్రత్యేకంగా మీకోసమే తీసుకొచ్చానుఈ పుష్పగుచ్ఛంలో కనీసం ఒక్క పువ్వయినా మీకు తప్పక నచ్చుతుందనీఅది మిమ్మల్ని గర్వపడేలా చేస్తుందనీ నాకు పూర్తి నమ్మకముంది.

 

సిద్ధంగా ఉన్నారాఆ పుష్పగుచ్ఛాన్ని మీ ముందుంచమంటారానాలాగే మీరు కూడా మీకు బాగా నచ్చిన పువ్వు కోసం వెతకవచ్చులేదా ఈ గుచ్ఛంలోని ప్రతి పుష్పమూ మీదే కావచ్చు.

 

మిత్రులారా,

నేడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ల ఉత్పత్తిదారు భారత్మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన దేశం భారత్ఈ రోజు ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగారెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌గా భారత్ నిలిచిందిగోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలోపాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిందిఅలాగే చేపల ఉత్పత్తిలోనూ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.

 

మిత్రులారా,

అది మాత్రమే కాదు.. నేడు భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెటుగా ఉందిప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగానూ అవతరించిందిఅతిత్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుగా భారత్ నిలవబోతోందిసౌరశక్తి సామర్థ్యం పరంగానూ ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.

మిత్రులారా,

నేడు సరికొత్త అభివృద్ధి నమూనాలను ప్రపంచానికి భారత్ పరిచయం చేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వేదికను భారత్ విజయవంతంగా నిర్వహిస్తోందినేడు భారత్‌లో యూపీఐ ద్వారా ప్రతి నెలా వందల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయిప్రపంచవ్యాప్తంగా పదుల కొద్దీ దేశాలు భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై ఆసక్తిని కనబరుస్తున్నాయిడ్రోన్ సాంకేతికతఅంతరిక్ష ఆర్థిక వ్యవస్థల్లోనూ భారత్ సరికొత్త శిఖరాలను చేరుతోంది.

 

మిత్రులారా,

ఇది నవభారత ముఖచిత్రం. న్యూజిలాండ్‌లాగే పర్యావరణానికీఆర్థిక వ్యవస్థకూ నడుమ సమతౌల్యంతో వ్యవహరిస్తోంది.

మిత్రులారా,

భారత్ వృద్ధిలో మరో కోణమూ ఉంది. ఇది మన వారసత్వంఆర్థిక వ్యవస్థకూపర్యావరణానికీ ప్రాధాన్యమిస్తూనే.. వారసత్వ పరిరక్షణపైనా ఇది ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

మిత్రులారా,

గురుగ్రంథ సాహిబ్ పవిత్ర స్వరూపాలను మనం కాపాడుకున్న విధానమే.. అవశ్యమైన సమయాల్లో భారత్ ఎలా స్పందిస్తుందో చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణఅఫ్గానిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తిన సమయంలో.. అక్కడి గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర స్వరూపాలను అత్యంత భక్తిశ్రద్ధలతోగౌరవప్రపత్తులతో మనం సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాం.

 

మిత్రులారా,

 

సేవధైర్యంసమానత్వంకరుణ అన్న సందేశాలను సమస్త మానవాళికీ మన సిక్కు గురువులు అందించారుప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలు నిస్వార్థ సేవలందిస్తున్నాయిఆకలితో వచ్చే వారికి అక్కడ భోజనం దొరుకుతుందికష్టాల్లో ఉన్నవారికి అండ లభిస్తుంది.

శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో జరిగే సేవలకు ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల వల్ల ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులను సిక్కు సమాజ పెద్దలు మా దృష్టికి తీసుకురాగా.. అదే స్ఫూర్తితో సమస్య పరిష్కారానికి మేం తక్షణ చర్యలు తీసుకున్నాం.

మిత్రులారా,

హేమకుండ్ సాహిబ్ జీ గురించి మీకందరికీ బాగా తెలుసు. సంవత్సరంలో ఎక్కువ భాగం దట్టమైన మంచుతో కప్పి ఉండే పర్వత శ్రేణుల నడుమ.. ఉన్నత హిమాలయ శిఖరాలపై ఈ పవిత్ర క్షేత్రం కొలువైందిఈ యాత్రామార్గం కఠినమైనదిసవాళ్లతో కూడుకున్నదిచాలా పరిమిత సంఖ్యలోనే భక్తులు ఈ యాత్రను చేయగలుగుతున్నారుముఖ్యంగా ఈ క్షేత్రాన్ని సందర్శించే మన సిక్కు సోదరీ సోదరులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ హేమకుండ్ సాహిబ్ యాత్రను మరింత సులభతరం చేయడానికి, ముఖ్యంగా వృద్ధ భక్తులుమన సిక్కు సోదరీ సోదరుల సౌకర్యార్థం.. ప్రభుత్వం ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రానికి ఒక ఆధునిక రోప్‌వేను నిర్మిస్తోంది.

మిత్రులారా,

సాహిబ్‌జాదాల ధైర్యసాహసాలు, త్యాగాలను చిరస్మరణీయం చేయడం లక్ష్యంగా.. ఏటా డిసెంబర్ 26న వీరబాల దివస్‌ను నిర్వహించాలని మన ప్రభుత్వం నిర్ణయించిందినేడు ఈ కార్యక్రమం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తోందికేరళ నుంచి అస్సాం వరకు.. దేశంలోని నలుమూలలా ఉన్న పిల్లలు ఈ రోజు ఆ సాహిబ్‌జాదాలుమాతా గుజ్రీల త్యాగాలను తెలుసుకుంటున్నారు.

వీరబాల దివస్ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది బాలలు, యువకుల గుండెల్లో అచంచలమైన స్ఫూర్తిని నింపుతోంది.

మిత్రులారా,

పవిత్ర జోరే సాహిబ్ గురించి కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. నా ప్రభుత్వ సహచరులలో ఒకరైన శ్రీ హర్దీప్ పూరి కుటుంబ పూర్వీకులు.. గురు గోవింద్ సింగ్‌కు స్వయంగా సేవలందించారుగురు గోవింద్ సింగ్మాతా సాహిబ్ కౌర్‌లకు చెందిన పవిత్ర జోరే సాహిబ్‌ను తమ కుటుంబం 300 ఏళ్లకు పైగా కాపాడుకుంటూ వస్తోందని శ్రీ హర్దీప్ పూరి నాతో చెప్పారు.

 

దేశ విభజన సమయంలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లోనూ.. శ్రీ పూరి పూర్వీకులు ఈ పవిత్ర అవశేషాలను సురక్షితంగా ఢిల్లీకి తీసుకువచ్చారుపెద్ద సంఖ్యలో భక్తులు ఆ పవిత్ర జోరే సాహిబ్‌ను దర్శించుకునిభక్తిశ్రద్ధలు చాటుకునే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో.. ఆ పవిత్ర జోరే సాహిబ్‌ను సిక్కు సంగత్‌కు అప్పగించాలని ఆ కుటుంబం భావించింది.

తర్వాత మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి, సిక్కు సంప్రదాయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నిపుణుల సలహాలను తీసుకున్నాంవారి సూచనల ఆధారంగా.. గురు గోవింద్ సింగ్ ఈ పవిత్ర భూమిపై మొదట అడుగుపెట్టిన చోటుఆయన జన్మస్థలమైన పూజనీయ పాట్నా సాహిబ్‌కు ఆ పవిత్ర జోరే సాహిబ్‌ను తీసుకెళ్లాలని నిర్ణయించాం.

ఆ పవిత్ర జోరే సాహిబ్ నేడు పవిత్ర పాట్నా సాహిబ్ మందిరానికి చేరడం సంతోషదాయకం. ఆ పవిత్ర ఘట్టానికి సాక్షిగా నిలవడంఆ కార్యక్రమంలో భాగస్వామినవడం నా అదృష్టంగా భావిస్తున్నానుమీరెప్పుడు భారత్‌కు వచ్చినా.. తప్పక పాట్నా సాహిబ్‌ను దర్శించుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నేను అపారమైన విశ్వాసంతో, మీరందించిన అమితమైన ఆప్యాయతతోమరెన్నో మధుర జ్ఞాపకాలతో ఇక్కడి నుంచి తిరిగి పయనమవుతున్నానుఅలాగే మీ అందరితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.. ఈ సారి ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడానికి 40 ఏళ్లు పట్టిందికానీఇకపై మీరు మరోసారి ఇంతకాలం వేచి చూడాల్సిన అవసరం రాదుమరో 40 ఏళ్లు అస్సలు పట్టదుఇది మోదీ గ్యారెంటీమోదీ గ్యారెంటీ అంటే.. తప్పక నెరవేరుతుందన్న భరోసా.

 

మిత్రులారా,

మీ అందరికీ ఒక మనవి. కొంతకాలం కిందట మన భారతీయ సంతతి పిల్లల కోసం ఒక సరికొత్త కార్యక్రమాన్ని మేం ప్రారంభించాంమన పిల్లలు భారత్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికీదేశ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటడానికీ ‘భారత్ కో జానియే క్విజ్’ను మేం మొదలుపెట్టాందీనికి సంబంధించి ఇప్పటివరకు సన్నాహక కార్యక్రమం మాత్రమే జరిగిందికానీ మన పిల్లల ఉత్సాహం నన్నెంతగానో ఆకట్టుకుంది.

ఇప్పుడు మరింతగా సాంకేతికతను జోడించి ఈ కార్యక్రమ ఆరో ఎడిషన్‌ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సారి చాలా పోటీలు యాప్ ద్వారానే జరుగుతాయిఇక్కడున్న యువత అంతా ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని కోరుతున్నానుభారత్‌ను మరింత లోతుగా తెలుసుకోండి.. సుసంపన్నమైన భారతీయ వారసత్వంతో న్యూజిలాండ్ ప్రజలను అనుసంధానించే వారధులుగా నిలవండి!

మిత్రులారా,

వికసిత భారత్ – సుసంపన్న న్యూజిలాండ్ సంకల్పంతో దేదీప్యమైన ఉజ్వల భవిత నాకు కనిపిస్తోందిఇదే విశ్వాసంతో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్‌కూ, ఆయన బృందానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలున్యూజిలాండ్ ప్రజలకు నా కృతజ్ఞతలు.

మరోసారి నాతో కలిసి నినదించండి.. భారత్ మాతా కీ జై!

వందేమాతరం!

ధన్యవాదాలు!

కియా ఒరా!

గమనిక – ప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదంఆయన హిందీలో ప్రసంగించారు.

***