పిఎంఇండియా
న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కజకిస్థాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు కాసిమ్–జోమార్ట్ టోకయేవ్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
కజకిస్థాన్‌తో భారతదేశానికి ఉన్న ప్రాచీన నాగరికతా సంబంధాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ గుర్తు చేసుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ – కజకిస్థాన్ సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నందుకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, భద్రత, అనుసంధానం, ఇంధనం, కీలక ఖనిజాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు సహా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలతో పాటు ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధి, సౌభాగ్యం కోసం భారత్ – కజకిస్థాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు.
****
PM @narendramodi met President @TokayevKZ in Delhi today. The two leaders discussed ways to give fresh momentum to the India-Kazakhstan Strategic Partnership, with a focus on trade, energy, technology, connectivity, investment and innovation. They also emphasised strengthening… pic.twitter.com/GAasX9dUSb
— PMO India (@PMOIndia) September 13, 2026
Glad to meet President Kassym-Jomart Tokayev during his first visit to India as President.
— Narendra Modi (@narendramodi) September 13, 2026
We had a very productive discussion on giving fresh momentum to the India-Kazakhstan Strategic Partnership.
We see immense potential to deepen cooperation in trade, investment, energy,… pic.twitter.com/fIc6AHPUAf