Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం

న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం


న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గౌరవనీయ సిరిల్ రామఫోసాతో సమావేశమయ్యారు.

భారత్‌- దక్షిణాఫ్రికాల మధ్య అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం సాధించిన ప్రగతిపై వారిద్దరూ సమీక్షించారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి చారిత్రక పోరాటాలు, బలమైన సాంస్కృతిక అనుబంధాలు, పటిష్ట ఆర్థిక సంబంధాలు, ప్రజల మధ్య ప్రగాఢ సంబంధాలతో ఉభయ దేశాల మధ్య సుదీర్ఘ, సన్నిహిత బంధం పెనవేసుకుందని వారు పునరుద్ఘాటించారు. పరస్పర ఆసక్తిగల వివిధ అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక వేదికలలో సన్నిహిత సమన్వమం కొనసాగించేందుకు అంగీకరించారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను విజయవంతంగా తరలించిన నేపథ్యంలో అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ సభ్యత్వం అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధానమంత్రి దక్షిణాఫ్రికాను కోరారు.

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేయడంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన తనకు, తమ ప్రతినిధి బృందానికి ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడంపై అధ్యక్షుడు రామఫోసా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

 

***