పిఎంఇండియా
న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఉగాండా ఉపాధ్యక్షురాలు గౌరవ జెసికా రోజ్ ఎపెల్ అలుపోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో ఫలవంతంగా ముగిసింది.
భారత్, ఉగాండాల ద్వైపాక్షిక సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. కీలక రంగాల్లో సహకారాన్ని ఇప్పటి కన్న పెంపొందించుకోవాలనీ, దీనికి సాంకేతిక భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడం, సామర్థ్యాలను పెంచుకోవడం, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, పెట్టుబడికి మార్గాన్ని సుగమం చేయడం, ఉభయ దేశాల్లో ప్రయివేటు రంగం సహకారాన్ని పొందడం వంటి మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందనీ గుర్తించారు. భారత్, ఉగాండాల అభివృద్ధి భాగస్వామ్యం ఇరు దేశాలకూ బలవర్ధకం అవుతుందని వారు వ్యాఖ్యానించారు. పరివర్తన పథంలో ఉగాండా వేగంగా పురోగమించడానికి ప్రకటించిన ‘విజన్ 2040’కు సంబంధించిన కార్యాచరణలో భారత్ వెన్నంటి నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రెండు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు ఈ భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని నేతలు స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని ప్రస్ఫుటంగా వినిపిస్తూ, ఆయా దేశాల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇరు దేశాలూ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని నేతలిద్దరూ పిలుపునిచ్చారు. శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నందుకు ఉపాధ్యక్షురాలు జెసికా రోజ్ ఎపెల్ అలుపోకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
***
PM @narendramodi met Vice President @jessica_alupo of Uganda on the sidelines of the BRICS Summit. He recalled his 2018 visit to Uganda and the Kampala Principles guiding India’s engagement with Africa. Discussions focused on deepening cooperation in healthcare, agriculture,… pic.twitter.com/FT4ktrnQvq
— PMO India (@PMOIndia) September 13, 2026
Delighted to meet Vice President Jessica Alupo of Uganda on the sidelines of the BRICS Summit. Recalled my memorable visit to Uganda in 2018 and the Kampala Principles that continue to guide India’s engagement with Africa.
— Narendra Modi (@narendramodi) September 13, 2026
We discussed ways to deepen cooperation in healthcare,… pic.twitter.com/Mg6jSsBJrt