పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015, సెప్టెంబరు 23వ తేదీ సాయంత్రం న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు.
న్యూయార్క్ నగరంలో ఈ నెల 24వ తేదీన జరిగే సీఈవోల సమావేశంలో భారత్ లో పెట్టుబడుల అంశమే లక్ష్యంగా వారితో సంభాషించనున్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో జె.పి.మోర్గన్, బ్లాక్ స్టోన్ లాంటి ఆర్థిక రంగ సంస్థల సీఈవోలతోనూ ప్రధాని మాట్లాడతారు. పారిశ్రామిక విధానం,
ప్రోత్సాహ విభాగంతో కలసి సంయుక్తంగా టైమ్ మ్యాగజీన్, ఫార్చూన్ మ్యాగజీన్లు ఏర్పాటు చేసే కార్యక్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ సీఈవో ల తోనూ ప్రధాని సమావేశం అవుతారు. ఈ సమావేశంలో లాక్హీడ్ మార్టిన్, ఫోర్డు, ఐబీఎమ్, పెప్సీ కో, జీఈ, బోయింగ్, మాస్టర్ కార్డు తదితర అమెరికా సంస్థలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
కమ్యూనికేషన్లు, సాంకేతికత, మీడియా పై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ప్రధాన మంత్రి పాల్గొంటారు.
గయానా అధ్యక్షుడు శ్రీ డేవిడ్ ఎ. గ్రాంగర్తో ప్రధాన మంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు.