Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూయార్క్ న‌గ‌రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కార్యక్ర‌మాలు

న్యూయార్క్ న‌గ‌రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కార్యక్ర‌మాలు

న్యూయార్క్ న‌గ‌రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కార్యక్ర‌మాలు


2015 అనంత‌ర అభివృద్ధి అజెండా ఆమోదానికి ఏర్పాటైన ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ద‌స్సులో ప్ర‌ధాని ప్రసంగం

త‌మ ప్ర‌భుత్వ అభివృద్ధి ప్రాధాన్య‌త‌ల వివ‌ర‌ణ‌, “వాతావ‌ర‌ణ న్యాయం” ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేక ప్ర‌స్తావ‌న‌

ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడితో ప్ర‌ధాని స‌మావేశాలు

జోర్డాన్ రాజు, ఈజిప్టు అధ్య‌క్షుడు, సెయింట్ లూసియా ప్ర‌ధానుల‌తో మోదీ భేటీ

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ 2015 అనంత‌ర అభివృద్ధి అజెండాపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ద‌స్సులో ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని త‌మ ప్ర‌భుత్వ అభివృద్ధి ప్రాధాన్య‌త‌లు ప్ర‌ధానంగా అంద‌రినీ ఆర్థిక కార్య‌క‌లాపాల్లో భాగ‌స్వాముల‌ను చేయ‌డం(ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్‌), ఔత్సాహిక పారిశ్రామికుల ప్రోత్సాహం, పున‌ర్ వినియోగ ఇంధ‌న వ‌న‌రులు వంటి అంశాల‌ను స‌వివ‌రంగా ప్ర‌స్తావించారు. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు ప‌రుస్తున్న “వాతావ‌ర‌ణ న్యాయం” సూత్రం ప్ర‌కృతి వైప‌రీత్యాల నుంచి పేద‌ల‌ను ర‌క్షించేందుకు త‌మ‌కు గ‌ల క‌ట్టుబాటుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.

న్యూయార్క్ న‌గ‌ర సంద‌ర్శ‌నను పుర‌స్క‌రించుకుని ప్ర‌|ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌పంచ‌బ్యాంకు అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌ధాని చేప‌ట్టిన స్వ‌చ్ఛ‌భార‌త్ చొర‌వ‌ను కిమ్ ప్ర‌శంసించారు. మోదీ నాయ‌క‌త్వం కార‌ణంగా భార‌త్‌ను ప్ర‌పంచం సంద‌ర్శించే తీరులో సుస్ప‌ష్ట‌మైన మార్పు వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. పున‌ర్ వినియోగ ఇంధ‌న వ‌న‌రులు, గంగా జ‌లాల శుద్ధి, మ‌రుగుదొడ్ల నిర్మాణం వంటి కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌భుత్వ క‌ట్టుబాటును ప్ర‌ధాని ఆయ‌న‌కు వివ‌రించారు. ప్ర‌పంచ‌బ్యాంకు పాల‌నా వ్య‌వ‌స్థ నిర్మాణం కూడా వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ వ్య‌వ‌స్థ‌లో భార‌త్‌కు మ‌రింత ప్రాధాన్యం ఉండాల‌ని ప్ర‌ధాని సూచించారు.

ప్ర‌ధాని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాన్ కి మూన్‌తో కూడా స‌మావేశ‌మ‌య్యారు. ఐక్య‌రాజ్య‌స‌మితి శాంతి ప‌రిర‌క్ష‌ణ కార్య‌క‌లాపాలు, భ‌ద్ర‌తా మండ‌లి సంస్క‌ర‌ణ‌లు ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. వాతావ‌ర‌ణ మార్పుల విష‌యంలో అభివృద్ధి చెందిన దేశాల‌కు, వ‌ర్థ‌మాన దేశాల‌కు మ‌ధ్య విశ్వాస రాహిత్య వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. ఉద్గారాల నిర్మూల‌న అంశానికే ప‌రిమితం కాకుండా సానుకూల ల‌క్ష్యాల సాధ‌న‌పై దృష్టి సారించాల‌ని ప్ర‌ధాని సూచించారు.

ప్ర‌ధాని జోర్డాన్ హ‌షీమైత్ రాజు అబ్దుల్లా 2 ఇబిన్ అల్ హుస్సేన్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఉగ్ర‌వాదం, ఇసిస్ ఉగ్ర‌వాదుల ఆగ‌డాల‌పై వారు స‌వివ‌రంగా చ‌ర్చించారు. ఉగ్ర‌వాదం స‌మ‌స్య‌పై అంత‌ర్జాతీయ స్పంద‌న అవ‌స‌ర‌మ‌న్న విష‌యం ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఈజిప్టు అధ్య‌క్షుడు అబ్దుల్ ఫ‌తా ఎల్ సిసితో కూడా ప్ర‌ధాని స‌మావేశ‌మయ్యారు. ఉగ్ర‌వాద వ్య‌తిరేక పోరాటం, రాడిక‌ల్ శ‌క్తుల వ్య‌తిరేక పోరాటం వంటి అంశాలు వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

సెయింట్ లూసియా ప్ర‌ధాని కెన్నీ డేవిస్ ఆంథోనీని కూడా ప్ర‌ధాని క‌ల‌సి చ‌ర్చ‌లు జ‌రిపారు.