Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ‘క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ ఇండియా 2019’ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


ఈ రోజు న ఇక్క‌డ‌ కు విచ్చేసిన వారంద‌రి కీ శుభాకాంక్ష‌లు. భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కీ ఒక గృహాన్ని స‌మ‌కూర్చ‌డం లో భాగం అయిన ఈ చ‌రిత్రాత్మ‌క కృషి లో మీరంద‌రూ ముఖ్య‌మైన భాగ‌స్వాములే.

గృహ నిర్మాణ రంగం లో పాలుపంచుకొంటున్న వారి తో ముఖాముఖి గా సంభాషించే అవ‌కాశం ఒక నెల రోజుల లో రెండో సారి నాకు లభించింది. మ‌రి ఇది మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాల వారు ఒక ఇంటి ని స‌మ‌కూర్చుకోవాల‌న్న క‌ల‌ల‌ ను పండించుకొనే దిశ గా మా వ‌చ‌న బ‌ద్ధ‌త లో ఉన్న‌టువంటి గంభీర‌త ను క‌ళ్ళ‌కు క‌డుతోంది. ఇక్క‌డ‌ కు విచ్చేసిన స్నేహితులు అనేకులు సిఆర్ఇడిఎఐ (‘క్రెడాయ్‌’) కార్య‌క్ర‌మం లో కూడా పాలుపంచుకొన్నారన్న సంగ‌తి ని నేను గ‌మ‌నిస్తున్నాను.

మిత్రులారా,

‘న్యూ ఇండియా’ యొక్క అవ‌స‌రాల కు అనుగుణం గా ఈ రంగాని కి అండ‌దండ‌ల‌ ను ఇవ్వ‌వ‌ల‌సింది గా గృహ నిర్మాణ రంగం లోని నా యువ మిత్రుల కు తాల్‌క‌టోరా స్టేడియ‌మ్ లో జరిగిన కార్యక్రమం లో నేను సూచించాను. మ‌రి ఇందుకోసం వారు ప్ర‌పంచ వ్యాప్తం గా గృహ నిర్మాణ రంగం లో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌వ‌ల‌సి ఉంటుంది. మీ యొక్క ప్ర‌య‌త్నాల లో మీతో క‌ల‌సి మాట్లాడ‌టాని కి, మీకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డాని కి మా ప్ర‌భుత్వం ఎప్ప‌టి కీ సిద్ధం గా ఉంది. దీని కి నిర్మాణ, సాంకేతిక విజ్ఞానాని కి సంబంధించిన ఈ స‌మావేశ‌ం ఒక అతి గొప్ప నిద‌ర్శ‌నం.

గృహ నిర్మాణ రంగం తో ముడివడి ఉన్న‌ వారి తో నేను భేటీ కావ‌డం ఇప్ప‌టికి ఇది రెండో సారి. గ‌తిశీలమైనటువంటి గృహ నిర్మాణ రంగం లో ప‌ని చేయ‌డం కోసం మీ యొక్క స‌ల‌హాల‌ ను అర్థం చేసుకోవ‌డాని కి, మీరు చేస్తున్న మంచి ప‌ని ని గురించి తెలుసుకోవ‌డాని కి, మీ అంద‌రితో క‌ల‌సి ముందుకు సాగ‌డాని కి ప్ర‌భుత్వాని కి ఉన్న‌టువంటి అభిలాష ను ఇది తేట‌తెల్లం చేస్తోంది. మ‌న దేశం లోని నిరుపేద‌ల‌ కు ల‌బ్ధి ని చేకూర్చే ఒక బ‌ల‌మైన గృహ నిర్మాణ రంగం పట్ల మీకు ఉన్న‌టువంటి అభినివేశాన్ని, వ‌చ‌నబ‌ద్ధ‌త‌ ను సైతం ఇది చాటి చెబుతోంది. ఈ స‌మావేశం లో పాలుపంచుకొన్న స‌భ్యులు గృహ నిర్మాణం ప‌రం గా కొత్త కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాల ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మో లేదా ఇక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌ కు త‌ర‌లి వ‌చ్చిన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల నుండి పాఠాల ను నేర్చుకోవ‌డ‌మో చేస్తార‌ని నేను త‌లుస్తాను. ఇది కూడా ఎంతో విలువైన‌ది అవుతుంది.

మిత్రులారా,

ఈ రోజు న జ‌రుగుతున్న స‌మావేశం లేదా గ్లోబ‌ల్ హౌసింగ్ టెక్నాల‌జీ ఛాలెంజ్ ఎందుకు అవ‌స‌ర‌మంటే, న‌గ‌రాలు విస్త‌రిస్తూ ఉన్నాయి. అంతేకాదు, దేశం లో అవి శ‌ర వేగం గా అభివృద్ధి చెందుతున్నాయి కూడాను. ప‌ట్ట‌ణీక‌ర‌ణ దూసుకుపోతున్నటువంటి దేశాల లో భార‌త‌దేశం కూడా ఒక దేశం గా ఉంది. ప‌ట్ట‌ణీక‌ర‌ణ దూసుకుపోతున్న ప‌రిణామం తో పాటే కొత్త ఇళ్ళ ఆవ‌శ్య‌క‌త కూడా పెరిగింది.

మిత్రులారా,

గృహ నిర్మాణ రంగం యొక్క ముఖచిత్రాన్ని మార్చివేయ‌డం కోసం ఏడు ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల పై మా ప్ర‌భుత్వం ఏక కాలం లో కృషి చేసింది. దీనిలో భాగం గా స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, దీన్‌ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న, నేశన‌ల్ అర్బ‌న్ లైవ్‌లీహుడ్ మిశన్‌, హెచ్ఆర్ఐడిఎవై (HRIDAY – ‘హృద‌య్’), ఇంకా ‘అమృత్’ (AMRUT) ల‌ను అమ‌లుప‌ర‌చ‌డ‌మైంది. దీనికి తోడు న‌గ‌రాల లో ర‌వాణా వ్య‌వ‌స్థ రూపు రేఖ‌ల‌ ను మార్చివేయ‌డం జ‌రుగుతోంది. స్మార్ట్ సిటీస్ వంటి ప‌థ‌కాల‌ ను అమ‌లులో కి తీసుకు రావ‌డం జ‌రుగుతోంది. దీని ని దృష్టి లో పెట్టుకొని, వివిధ భౌగోళిక ప‌రిస్థితుల‌ కు త‌గ్గ‌ట్టు ఇళ్ళ‌ ను నిర్మించవలసినటువంటి ఒక స‌వాలు ప్రస్తుతం మన ముందు ఉంది.

మిత్రులారా,

మా ప్ర‌భుత్వం ఈ స‌వాళ్ళ‌ ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకొని, నిర్మాణ రంగం లో ఒక ప‌రిపూర్ణ‌ దృక్ప‌థం తో కృషి చేసింది. ఇళ్ళ‌ ను నిర్మిస్తున్న సంస్థ‌ లు, ఇళ్ళ ను కొనుగోలు చేస్తున్న వారు.. ఈ రెండు వ‌ర్గాలు ఎదుర్కొంటున్న‌టువంటి స‌మ‌స్య ల‌ను దృష్టి లో పెట్టుకొని మేము నిర్ణ‌యాల ను తీసుకొన్నాము. మేము చాలా వ‌ర‌కు త‌క్కువ ఖ‌ర్చు అయ్యే గృహ నిర్మాణాని కి పెద్ద పీట వేశాము. రెండోది, స్థిరాస్తి రంగాని కి సంబంధించిన చ‌ట్టాల లో మేము మార్పు చేర్పులను చేశాము. మూడోది, మేము నైపుణ్యాల అభివృద్ధి విష‌యం లో క‌స‌ర‌త్తు చేశాము. నాలుగోది, వీట‌న్నింటి కీ తోడు గృహ నిర్మాణ రంగం లో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని మెరుగు ప‌ర‌చ‌డం పైన మేము శ్ర‌ద్ధ తీసుకొన్నాము. ఈ రోజు న జ‌రుగుతున్న‌టువంటి ఈ కార్య‌క్ర‌మం కూడా దీని కి సంబంధించిందే. మ‌రి నేను మీకు గుర్తు చేయ‌ద‌ల‌చుకున్న అంశం ఏమిటంటే ‘ప‌్ర‌గ‌తి’ (PRAGATI) మాధ్య‌మం ద్వారా జ‌రిగిన ఒక స‌మావేశం లో – నేను నిర్వ‌హిస్తున్న‌ ‘ప‌్ర‌గ‌తి’ స‌మావేశాల‌ ను గురించి మీకు తెలిసే ఉంటుంది కాబ‌ట్టి- నేను వివ‌రాల జోలి కి వెళ్ళ‌ద‌ల‌చుకోలేదు. ‘ప‌్ర‌గ‌తి’ స‌మావేశాల లో, ఒక స‌మావేశం లో ‘గ్లోబ‌ల్ ఛాలెంజ్ ప్రాసెస్’ను అనుస‌రించవలసిందంటూ మంత్రిత్వ శాఖ‌ల కు నేను సూచించాను. మ‌రి ఈ రోజు న మీరంతా గ్లోబ‌ల్ హౌసింగ్ టెక్నాల‌జీ ఛాలెంజ్, ఇండియా మాధ్య‌మం ద్వారా ఇక్క‌డ‌ కు వచ్చారంటే నాకు సంతోషం గా ఉంది.

మిత్రులారా,

ఒక గృహం అంటే కేవ‌లం నాలుగు గోడ‌లే కాదు. అది క‌ల‌ల ను క‌నేట‌టువంటి, మ‌రియు ఆకాంక్ష‌ల‌ ను నెర‌వేర్చుకొనేట‌టువంటి ఒక ప్ర‌దేశం. ఒక ఇల్లు అనేది భ‌ద్ర‌త కు మ‌రియు దర్జా కు, అలాగే ఆశ్ర‌యాని కి సంబంధించిన‌టువంటిది. మ‌న దేశం వంటి ఒక దేశం లో చాలా మంది ప్ర‌జ‌లు వారికి అంటూ ఒక సొంత ఇంటి కి నోచుకోక‌పోవ‌డం అనేది నాకు ఎప్ప‌టి కీ దుఃఖాన్ని మరియు దిగ్భ్ర‌ను క‌లిగించేట‌టువంటి విష‌యం. ఈ ప‌రిస్థితి ని చ‌క్క‌దిద్ద‌డాని కి ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న రూపం లో మేము కృషి చేస్తున్నాము. 2022వ సంవ‌త్స‌రం క‌ల్లా భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రూ ఒక ప‌క్కా ఇంటి ని క‌లిగివుండాల‌నేది నా స్వ‌ప్నం. మ‌రి, ఈ విష‌యం లో మేము చెప్పిన మాట‌ల ను ఆచ‌రించి చూపేందుకు న‌డుం క‌ట్టాము. మా ప‌ద‌వీకాలం లో ఇప్ప‌టికే 1.3 కోట్ల‌ కు పైగా ఇళ్ళ ను నిర్మించ‌డ‌మైంది. ఇది ఏ స్థాయి లో సాగుతోందో మీకు తెలియాలి అంటే, ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వం కేవ‌లం 25 ల‌క్ష‌ల గృహాల‌ ను నిర్మించింది మ‌రి! సంఖ్య‌ లు త‌మంత‌ట తామే మాట్లాడుతాయి. మా యొక్క కృషి నాలుగు గోడ‌ల‌ ను నిర్మించ‌డం తోనే ఆగిపోదు. ఆ ఇళ్ళ‌ కు నీటి స‌దుపాయాన్ని, విద్యుత్తు సౌక‌ర్యాన్ని, ఉజ్జ్వ‌ల స‌దుపాయాన్ని, ఇంకా త‌దిత‌ర స‌దుపాయాలను జ‌త పరిచేటట్లు మేము శ్ర‌ద్ధ వహిస్తున్నాము. గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల లో ఇంటి యొక్క చోటు తో పాటు ఇళ్ళ యొక్క నాణ్య‌త సైతం మెరుగుపడింది. అయితే, చేయ‌వ‌ల‌సింది ఇంకా ఎంతో ఉంది. అందుకోసం నేను ప్రైవేటు రంగం నుండి అండ‌దండ‌ల‌ ను ఆశిస్తున్నాను. మరి ఇది స‌మ‌కూరాలి అంటే గ్లోబ‌ల్ హౌసింగ్ ఛాలెంజ్ క‌న్నా మెరుగైన మార్గం మ‌రొక‌టి ఏమి ఉంది. మ‌నం అంతా క‌ల‌సిక‌ట్టు గా కృషి చేస్తూ, మ‌న సామ‌ర్ధ్యాల‌ ను పెంపొందింప చేసుకొని నిరుపేద‌ల కు స‌హాయ‌కారి గా నిల‌చే ఏదైనా ఒక ప‌ని ని చేద్దాము.

మిత్రులారా,

త‌ల మీద ఒక క‌ప్పు ను ఏర్ప‌ర‌చుకోవాల‌న్న పేద‌ లు మ‌రియు మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాల యొక్క క‌ల ఏ విధం గా అయితే భ‌గ్నం అవుతోందో, అది స‌రి అయిన‌ది కాదు. ఈ ప‌రిస్థితి ని మార్చి వేయ‌డం కోసం మేము వేరు వేరు స్థాయిల లో క‌ల‌సి ప‌ని చేశాము. ఒక గృహాన్ని కొనుగోలు చేయ‌డం లో పేద లు, మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఎదుర్కొనే ప్ర‌తి ఒక్క స‌మ‌స్య కు ప‌రిష్కారాల‌ ను సూచించాల‌ని మేము ప్ర‌య‌త్నించాము. మా ప్ర‌భుత్వం యొక్క కృషి ఫ‌లితం గా ఈ రోజు న గృహ రుణాల తాలూకు వ‌డ్డీ రేట్లు మునుప‌టి తో పోలిస్తే త‌గ్గాయి. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న లో భాగం గా ప్ర‌భుత్వం అందిస్తున్న‌టువంటి స‌డ‌లింపు ప్ర‌జ‌లు దాదాపు గా 5-6 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదా చేసుకోవ‌డం లో దోహ‌దం చేయ‌నుంది. అంటే, ఒక వ్య‌క్తి 20 సంవ‌త్స‌రాల కాలాని కి 19 లేదా 20 ల‌క్ష‌ల రూపాయ‌ల రుణం తీసుకొన్న ప‌క్షం లో, ఈ ప‌థ‌కాల స‌హాయం ద్వారా అత‌డు ఖ‌చ్చితం గా 5 లేక 6 ల‌క్ష‌ల రూపాయల ను ఆదా చేసుకోగ‌లుగుతాడు.

మిత్రులారా,

మా ప్ర‌భుత్వం ఆదాయ‌పు ప‌న్ను కు మ‌రియు ప‌రోక్ష ప‌న్నుల‌ కు సంబంధించిన చ‌ట్టాల‌ లో స‌వ‌ర‌ణ‌ల‌ ను తీసుకొని వ‌చ్చింది. ఇది పేద లు మ‌రియు మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఒక ఇంటి ని కొనుగోలు చేయ‌డం కోసం ఎక్కువ డ‌బ్బు ను వారి వ‌ద్ద క‌లిగి వుండేట‌ట్లుగా చూడ‌టం తో పాటు గృహాల ధ‌ర‌ల‌ ను సైతం త‌గ్గించే విధం గా ఉంది. ఈ రెండు ముఖ్య‌మైనటువంటి నిర్ణయాల‌ ను ఇటీవ‌ల ప్ర‌భుత్వం మ‌రియు జిఎస్‌టి కౌన్సిల్‌ తీసుకొన్నాయి. ఆదాయ‌పు ప‌న్ను విష‌యాని కి వ‌స్తే, 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప‌న్ను విధించ‌ద‌గ్గ ఆదాయాన్ని 0 శాతం ప‌న్ను ప‌రిధి కింద‌కు తీసుకొని రావ‌డం జ‌రిగింది. దీని కి అద‌నం గా రెండు ఇళ్ళ అంచ‌నా కిరాయి పైన ఎటువంటి ఆదాయ‌పు ప‌న్ను ను చెల్లించ‌న‌క్క‌ర లేదు. ఇదే మాదిరి గా, ప్ర‌స్తుతం ఒక్క ఇంటి కి బ‌దులు రెండు ఇళ్ళ‌ కు మూల‌ధ‌న ప‌న్ను ను మిన‌హాయించ‌డం జ‌రుగుతుంది. ఈ బ‌హుళ‌ ప్ర‌య‌త్నాలు మ‌ధ్య‌ త‌ర‌గ‌తి కుటుంబం ఒక కొత్త ఇంటి ని కొనుగోలు చేసేట‌ట్లు గా ఆ యొక్క కుటుంబాన్ని ప్రోత్స‌హించగలవు. మ‌రి మీ యొక్క వ్యాపారం సైతం నేరు గా లబ్ధి ని పొంద‌డం త‌థ్యం. మీరు చ‌ప్ప‌ట్లు చ‌ర‌చ‌వ‌చ్చును.

మిత్రులారా,

జిఎస్‌టి అనేది స్థిరాస్తి వ్యాపారాన్ని, అటు వినియోగ‌దారుల‌ కు, ఇటు భ‌వ‌న నిర్మాత‌ల‌ కు కూడాను ఎంతో స‌ర‌ళ‌త‌రం గా మార్చివేసింది. ఇటీవ‌ల జిఎస్‌టి ని నిర్మాణ రంగం ప‌రం గా చూసిన‌ప్పుడు గ‌ణనీయం గా త‌గ్గించ‌డం జ‌రిగింది. త‌క్కువ ఖ‌ర్చు అయ్యేట‌టువంటి గృహ నిర్మాణం పై జిఎస్‌టి ని 8 శాతం నుండి 1 శాతాని కి త‌గ్గించ‌డ‌మైంది. మ‌రోవైపు, నిర్మాణాధీనం లో ఉన్న గృహ నిర్మాణ ప‌థ‌కాల‌ కు జిఎస్‌టి ని 12 శాతం నుండి 5 శాతాని కి త‌గ్గించ‌డ‌మైంది. మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ కు ఉద్దేశించిన ప‌థ‌కాల‌ కు నిధుల సేక‌ర‌ణ నిమిత్తం అఫార్డ‌బుల్ హౌసింగ్ ఫండ్ ను కూడా స్థాపించ‌డ‌మైంది.

మిత్రులారా,

మ‌రిన్ని ఇళ్ళ‌ను, అలాగే మ‌రిన్ని ఉత్త‌మ‌మైన ఇళ్ళ‌ ను నిర్మించాలి అంటే, మ‌నం గృహ నిర్మాణ రంగం లో ఉన్న‌వారి సూచ‌న‌ లు, స‌ల‌హా ల ప‌ట్ల సూక్ష్మ గ్రాహ్య‌త ను కూడా క‌లిగి వుండాలని మేము ఎరుగుదుము. మరి, మేము అదే ప‌ని ని చేస్తున్నాము. మేము గృహ నిర్మాణ రంగాన్ని ప‌టిష్టం చేయ‌డం మ‌రియు సంస్క‌రించ‌డం పై క‌స‌ర‌త్తు చేస్తున్నాము. స్థిరాస్తి రంగం లో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని మ‌రియు భ‌వన నిర్మాత‌ల ప‌ట్ల వినియోగ‌దారుల లో విశ్వాసాన్ని మెరుగు ప‌ర‌చిన‌టువంటి ఆర్ఇఆర్ఎ చ‌ట్టం మొద‌లుకొని నిర్మాణ అనుమతి పత్రాలలో మెరుగుదల ద్వారా ప్ర‌పంచ బ్యాంకు యొక్క ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్’లో మ‌న స్థానాన్ని చెప్పుకోద‌గిన రీతి లో ఎగువకు, అంటే భారతదేశాన్ని 181వ స్థానం నుండి 52వ స్థానానికి చేర్చడం వ‌ర‌కు మేము అదే ప‌ని గా వ్య‌వ‌స్థాగ‌త సంస్క‌ర‌ణ‌ ల పైన దృష్టి ని కేంద్రీకరిస్తూ వ‌స్తున్నాము.

మిత్రులారా,

ప్ర‌భుత్వ విధానాల ద్వారా మ‌రొక మార్గం లో కూడాను మీరు ల‌బ్ధి ని పొంద‌గ‌లుగుతారు. ఇళ్ళు క‌ట్ట‌డం ఎలాగో తెలిసిన మాన‌వ వ‌న‌రుల భారీ రాశి ఒక‌టి ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంతాల లో రూపుదిద్దుకొంది. వారు ఆ ప‌ని లో శిక్ష‌ణ ను పొందివున్నారు. ఈ రంగం లో మ‌హిళ‌ల‌ కు శిక్ష‌ణ ఇవ్వ‌డం కోసం ఒక ప్ర‌చార ఉద్య‌మాన్ని కూడా మా ప్ర‌భుత్వం ప్రారంభించింది. ఈ శిక్ష‌ణ ప్ర‌చార ఉద్య‌మం ముగినిన అనంత‌రం వేలాది మ‌హిళ‌లు ప్ర‌ధాన శ్రామికులు గా ప‌ని చేస్తున్నారు.

ఈ రంగం లో యువ‌త ను విప‌ణి అవ‌స‌రాల‌ కు త‌గిన‌ట్లు మ‌ల‌చ‌డాని కి వారి లో సాంకేతిక‌ప‌ర‌మైన నైపుణ్యాన్ని పెంచాల‌ని మేము కోరుకొంటున్నాము. త‌ద్వారా మీ వంటి న‌వ‌ పారిశ్రామికులు కూడా ల‌బ్ధి ని పొంద‌గ‌లుగుతారు. అంతేకాకుండా, యువ మిత్రుల‌ కు మ‌రెన్నో అవ‌కాశాలు కూడా అంది వ‌స్తాయి. దీని కి తోడు, సాంకేతిక‌త లో ఎప్ప‌టిక‌ప్పుడు చోటు చేసుకొంటున్న మార్పుల ఆధారం గా ఇంజినీరింగ్, ఇంకా టెక్నాల‌జీ కోర్సుల లో మార్పుల‌ ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని కూడా క‌స‌ర‌త్తు చేయ‌డం జ‌రుగుతోంది. అదీగాక, యువ న‌వ‌ పారిశ్రామికుల కు, స్టార్ట్-అప్ ల‌ కు ఈ రంగం ఒక కొత్త ఐచ్ఛికం గా కూడా ఎదుగుతోంది.

మిత్రులారా,

భార‌త‌దేశం లో నిర్మాణ రంగ వైఖ‌రి లో మేము మ‌రొక సంస్క‌ర‌ణ ను ప్ర‌వేశ‌పెట్టాం. ప్ర‌స్తుతం అవి ర‌హ‌దారులు కావ‌చ్చు, నివాస భ‌వ‌న స‌ముదాయాలు కావ‌చ్చు, లేక వాణిజ్య భ‌వ‌నాలు కావ‌చ్చు.. ప‌ర్యావ‌ర‌ణ స్నేహ‌పూర్వ‌క‌మైన‌టువంటి, విప‌త్తుల‌ కు త‌ట్టుకొని నిల‌బ‌డేట‌టువంటి, మ‌రియు శ‌క్తి ని ఆదా చేసేట‌టువంటి నిర్మాణాల‌ ను మేము ప్రోత్స‌హిస్తున్నాము. దీని కి గాను, స్థానిక ప్రాతిప‌దిక క‌లిగిన నూత‌న ఆవిష్క‌ర‌ణ అవ‌స‌ర‌మ‌వుతుంది. దీని లో మ‌న యువ భాగ‌స్తులు నిమ‌గ్న‌మై ఉన్నారు.

మిత్రులారా,

అఫార్డ‌బుల్ స‌స్‌టైన‌బుల్‌ హౌసింగ్ యాక్సిలేట‌ర్ అయినటువంటి ఎఎస్‌హెచ్ఎ- ఇండియా ఆ తరహా కు చెందిన నూత‌న ఆవిష్క‌ర‌ణల లో, వేటినైతే విప‌ణి కావాల‌నుకొంటోందో, వాటి లో పెట్టుబ‌డి పెడుతోంద‌ని తెలుసుకొంటే గనక మీరు సంతోషిస్తారు. దీని లో భాగం గా స్టార్ట్-అప్ ఇకో-సిస్ట‌మ్ మ‌రియు యువ న‌వ పారిశ్రామికుల ఆలోచ‌న‌ల ను విప‌ణి కి త‌గ్గ‌ట్లు గా ఉండేట‌టువంటి మ‌ల‌చే ప‌ని ముంబ‌యి, మ‌ద్రాసు, ఖ‌ర‌గ్‌పుర్‌, ఇంకా రూర్కీ ఐఐటి ల‌లో నాలుగు ఇంక్యుబేశన్ సెంట‌ర్ ల‌లో కొన‌సాగుతోంది.

మిత్రులారా,

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు, సాంకేతిక విజ్ఞానం, ఇంకా ఇంజినీరింగ్ ల వంటి రంగాల‌ లో కృషి చేస్తున్న విద్యార్థుల‌ లో కొంద‌రు విద్యార్థులు సైతం ఇక్క‌డ‌ కు వ‌చ్చార‌ని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను. ఇక్క‌డ జ‌రిగే చ‌ర్చ నేశ‌న‌ల్ నాలెడ్జ్ నెట్ వ‌ర్క్ (ఎన్‌కెఎన్‌) కు కూడా సంబంధించింది. దేశం లోని విద్యా సంస్థ‌ లు దీని ద్వారా ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌లుగుతాయి. ఈ నెట్ వ‌ర్క్ ద్వారా ఇక్క‌డ చ‌ర్చించే స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించే అవ‌కాశాన్ని విద్యా సంస్థ‌ లకు కూడా ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

గృహ నిర్మాణ సాంకేతిక‌త కు సంబంధించి భార‌త‌దేశం లో జ‌రుగుతున్న ఈ అద్భుత‌మైనటువంటి ప్ర‌యోగం లో ఒక భాగాన్ని మీరూ పంచుకోవ‌చ్చును. ఇందుకోస‌మే లైట్ హౌస్ ప్రాజెక్టు ను మొద‌లు పెడుతున్నాం. ఈ ప‌థ‌కాల‌ ను ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, త్రిపుర‌, త‌మిళ నాడు, మ‌ధ్య ప్ర‌దేశ్‌, ఝార్‌ఖండ్‌, ఇంకా గుజ‌రాత్ ల‌లో ఆరంభిస్తున్నాము. మీరు నిర్మాణ రంగం తాలూకు నూత‌న మెల‌కువ‌ల‌ ను ప్ర‌ద‌ర్శించే వీలు ఉంది. ఇవి మీ కోసం ప్ర‌త్య‌క్ష ప్ర‌యోగశాల‌లు గా అందుబాటు లో ఉంటాయి. ఇక్క‌డ మీరు వెబ్‌కాస్ట్ డెమోస్ వంటి సాంకేతిక‌త ల స‌హాయం తో దేశం లోని యువ వృత్తి నిపుణుల‌ తో సంభాషించ గ‌లుగుతారు.

జిహెచ్‌టిసి – ఇండియా అనేది భార‌త‌దేశ నిర్మాణ రంగం, అంత‌ర్జాతీయ ఇకో-సిస్ట‌మ్ స్థాయి ని అందుకొనేందుకు ఉప‌యోగ‌ప‌డేట‌టువంటి ఒక వేదిక‌. దీని ద్వారా మ‌నం మ‌న స‌వాళ్ళ కు ప్రపంచ శ్రేణి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఆస్కారం ఉంటుంది.

మీ ఉత్సాహాన్ని బ‌ట్టి చూస్తూ ఉంటే, ఇది విప్ల‌వాని కి ఒక నాంది అని నేను స్ప‌ష్టం గా చెప్ప‌గ‌ల‌ను. మ‌రి మ‌నం ఇప్పుడు మ‌న న‌గ‌రాల‌ లో నిర్మాణ రంగాన్ని ప్ర‌పంచ ప్ర‌మాణాల కు అనుగుణం గా మార్చే దిశ లో ముందుకు క‌దులుతున్నాము.

మిత్రులారా,

ఈ స‌మావేశం ఒక్క భార‌త‌దేశాని కి ప్రయోజనాన్ని చేకూర్చ‌డం మాత్రమే కాదు, భ‌వ‌న నిర్మాత‌ల‌ కు, వాస్తు శిల్పుల‌ కు, ప్లాన‌ర్స్ కు, ఇంకా ప్రపంచ‌ వ్యాప్తం గా గ్లోబ‌ల్ సివిల్ ఇంజినీరింగ్ ఫ‌ర్మ్‌స్‌ కు కూడాను ల‌బ్ధి ని చేకూర్చ‌గ‌ల‌దు. మ‌నం ఒక‌రి నుండి మ‌రొక‌రం ఎన్నో విష‌యాల‌ ను నేర్చుకోబోతున్నాము.

మిత్రులారా,

‘న్యూ ఇండియా’ యొక్క నూత‌న వ్యాపార వాతావ‌ర‌ణం లో మీ రంగాని కి అపార‌మైన‌టువంటి అవ‌కాశాలు ఉన్నాయి. దేశం లో న‌వ మ‌ధ్య‌త‌ర‌గ‌తి చాలా వేగం గా వ్యాప్తి చెందుతోంది. ఇళ్ళ కోసం డిమాండు అత్యంత వేగ‌వంత‌మైన రీతి లో పెరుగుతున్న ప్ర‌పంచం లోని కొన్ని దేశాల‌ లో భార‌త‌దేశం కూడా చోటు ను సంపాదించుకుంది.

ఈ డిమాండు ను నెర‌వేర్చ‌డం కోసం, అలాగే నిర్మాణం లో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని గ‌రిష్ట స్థాయి లో వినియోగించుకోవ‌డం కోసం 2019వ సంవ‌త్స‌రం ఏప్రిల్ మొద‌లుకొని 2020వ సంవ‌త్స‌రం మార్చి నెల వ‌ర‌కు ఉన్న‌టువంటి సంవ‌త్స‌రాన్ని- నిర్మాణ, సాంకేతిక విజ్ఞాన సంవ‌త్స‌రం- గా కూడా నేను ప్ర‌క‌టిస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు న ఇక్క‌డ ఒక అట్లాసు ను అంకితం చేసే అవ‌కాశం నాకు లభించింది. విప‌త్తు కు సంబంధించిన అంశాలు చాలా సంవ‌త్స‌రాల పాటు వ్య‌వ‌సాయ విభాగం ప‌రిధి లో ఉండేవ‌ని తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌ చకితులు అవుతారు. విప‌త్తు అనే మాట‌ కు నిర్వ‌చ‌నం వ‌ర‌ద‌ల‌ కు మ‌రియు అనావృష్టి కి ప‌రిమితం అయిన కార‌ణం గా అది వ్య‌వ‌సాయ విభాగం లో ఒక భాగం గా ఉండిపోయింది. ఇది ఎంతటి హ్రస్వమైన ఆలోచ‌న‌ల స‌ర‌ళో కదా! ఈ ర‌కం గా దీని ని సంబాళించే ప‌ని వ్య‌వ‌సాయ రంగం తో సంబంధం ఉన్న వ్య‌క్తుల తో ముడిప‌డింది. గుజ‌రాత్ లో 2001వ సంవ‌త్స‌రం లో భూకంపం వ‌చ్చిన త‌రువాత ఇది ఒక గంభీరమైన‌టువంటి స‌వాలు అనే విష‌యం గ్ర‌హింపు లోకి వ‌చ్చింది. త‌ద‌నంత‌రం ముఖ్య‌మైన‌ ఈ అంశాన్ని హోం మంత్రిత్వ శాఖ కు అప్ప‌గించ‌డం జ‌రిగింది. ఆ శాఖ రాష్ట్రాల‌ తో స‌మ‌న్వ‌యం నెర‌పుతోంది. అట‌ల్ గారి హ‌యాం లో చోటు చేసుకొన్న ఒక గొప్ప వ్య‌త్యాసం ఇది. మ‌నం ఏదైనా జ‌రిగే క‌న్నా ముందే దాని ని ఎదుర్కొనేందుకు దేశాన్ని స‌న్న‌ద్ధం గా ఉంచాలి. గుజ‌రాత్ లో తొలుత జిల్లా స్థాయి లో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఇందులో భాగం గా, విప‌త్తు కు లోన‌య్యే ప్రాంతాల ను గుర్తించి జిల్లా వారీ మ్యాపుల ను, గ్రామం వారీ మ్యాపుల ను సిద్ధం చేయడమైంది. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం దేశం లో వివిధ మండలాల‌ ను ఏర్పాటు చేయ‌డం నాకు సంతోషం క‌లిగించే విష‌యం. నిర్మాణ ప‌నుల తో సంబంధం క‌లిగిన వారు, భ‌వ‌న నిర్మాత‌లు మ‌రియు గొట్ట‌పు మార్గాల‌ ను వేసే వారు, అలాగే, గ్యాస్ స‌ర‌ఫ‌రా కోసం గొట్ట‌పు మార్గాల‌ ను వేసే వారు.. వీరంతా ఈ అట్లాస్ ను దృష్టి లో ఉంచుకొని వారి వారి ప్ర‌ణాళిక‌ల‌ ను రూపొందించుకోవల‌సింది గా నేను కోరుతున్నాను. వారు టెండ‌ర్ ను దాఖ‌లు చేసేట‌ప్పుడు, అట్లాసు ను అధ్య‌య‌నం చేశామ‌న్న వాస్త‌వాన్ని ఒక రెఫ‌రెన్స్ గా ప్ర‌భుత్వాని కి తెలియ‌ జేయాల‌ని కూడా నేను కోరుతున్నాను. మీరు ఒక ఫ‌లానా ప్రాంతం లో ప‌ని ని మొద‌లు పెట్టే ముందు, ఈ అట్లాసు లో పేర్కొన్న‌టువంటి అంశాల ను ఏ విధం గా ప‌రిష్క‌రించ‌గ‌ల‌ర‌నేది ప్ర‌స్తావించ‌వ‌ల‌సి ఉంటుంది. అటు త‌రువాత మాత్ర‌మే దీని ని సంస్థాగ‌తం గా మ‌ల‌చ‌డం జ‌రుగుతుంది. అదే విధం గా, ఆయా ప్రాంతాల లో ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చ‌ర్ లేదా నిర్మాణాని కి సంబంధించిన‌టువంటి విశ్వ‌విద్యాల‌యాలు, వాటి యొక్క పాఠ్య క్ర‌మం లో దుర్భ‌ల‌మైన‌టువంటి రంగాల‌ ను చేర్చాలి. త‌ద్వారా ఆయా ప్రాంతాల లో మాన‌వ వ‌న‌రులు అభివృద్ధి చెందేట‌ప్ప‌టికి వారు నిర్మాణం లో ఎదురయ్యే స‌వాళ్ళ‌ ను గురించిన అవ‌గాహ‌న ను క‌లిగివుండ‌టం సాధ్య‌మవుతుంది. మ‌రి అలాగే నిర్మాణ ప‌ని లో వారు ఏ విధం గా ముందుకు పోగ‌ల‌ర‌నే మార్గం ప‌ట్ల కూడా వారి కి స్పృహ ఉంటుంది.

ఈ కార‌ణం గా, నిపుణులంద‌రినీ నేను కోరేది ఏమిటంటే అట్లాసు పై ఆధార‌ప‌డి మీ మీ కంపెనీల లో ఒక రెండు రోజుల వ‌ర్క్ షాప్ ను నిర్వ‌హించండి అని. అట్లాసు ను అర్థం చేసుకోవ‌డాని కి మ‌నం ప్ర‌య‌త్నించాలి. అలాగే, దాని కి సంబంధించిన అంశాల ను కూడా మనం గ్ర‌హించాలి. ఎందుకంటే ఈ అంశాల ను ముందుకు తీసుకు పోవ‌ల‌సి ఉంది. మీరు భార‌త‌దేశం యొక్క శ‌క్తి ని అర్థం చేసుకొంటారు. సాపేక్షం గా త‌క్కువ శ్ర‌ద్ధ ను కోరేట‌టువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఈ రంగం లో చాలా కాలం పాటు భార‌త‌దేశం ఏ విధం గా ముందుకు పోగ‌ల‌దో అనే అంశం లో నిర్మాణ రంగం తో ముడిప‌డిన వారంద‌రి కీ ప్రావీణ్యం ఉన్న‌ది. కానీ, ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన కుంభ్ ను చూసిన వారికి తాత్కాలిక ఏర్పాట్ల‌ను ఎంత అద్భుత‌మైన రీతి లో చేయ‌వ‌చ్చో అర్థం అయివుంటుంది! దాని ని ఈ దేశం చేసి చూపించింది.

గంగా న‌ది ఒడ్డున 40 రోజుల లోగా 22 కోట్ల మంది కి పైగా ప్ర‌జ‌లు గుమిగూడే అవ‌కాశం ఉంది. ప్ర‌తి రోజూ, ఒక రకం గా చెప్పాలంటే యూరోప్ లో ఉన్నంత‌టి జ‌న సందోహం గంగా న‌ది తీర ప్రాంతాలకు తరలివస్తుంది. అక్క‌డ ప‌రిశుభ్ర‌త ను ఎంత చ‌క్క‌గా ప‌రిర‌క్షించ‌ గ‌ల‌మ‌నేది దేశం నిరూపించింది. పైపెచ్చు, మ‌న యువ‌జ‌నులు సాంకేతిక విజ్ఞానం ద్వారా కేంద్రీయ నియ‌ంత్ర‌ణ వ్య‌వ‌స్థ ఏ విధం గా ప‌ని చేయ‌గ‌లుగుతుందో మ‌రియు కుంభ్ మేళా సంద‌ర్భం గా స్మార్ట్ సిటీ భావ‌న ను ఏ విధం గా పురికొల్ప వ‌చ్చో చేతలలో చూపెట్టారు. అంటే, మ‌న దేశాని కి ఆ స‌త్తా ఉందీ అన్న మాట‌. మ‌రింత మెరుగైన వ్య‌వ‌స్థ ల‌ను మ‌న ప్ర‌జ‌లు ఏ విధంగా అభివృద్ధి చేయ‌గ‌ల‌ర‌నేది మ‌నం గ్ర‌హించ‌గ‌లిగితే మ‌రియు తాత్కాలికం గా చేసిన ఏర్పాట్లే అంత సుంద‌రం గా ఉన్నప్పుడు ఇక ఒక శాశ్వ‌త‌మైన ఏర్పాటు ను చేయ‌డం అనేది ప్ర‌పంచాని కి ఒక న‌మూనా ను అందివ్వ‌గ‌లుగుతుంది. ఈ రెండు రోజుల మేధోమ‌థ‌న స‌ద‌స్సు లు మీ కంపెనీ యొక్క ప‌రిస్థితి ని మెర‌గు ప‌ర‌చే ఆలోచ‌న‌ల‌ ను వెద‌జ‌ల్ల‌డ‌మే కాకుండా, ఒక కొత్త బ‌లాన్ని కూడా జోడించ‌ గ‌లుగుతాయ‌ని నేను న‌మ్ముతున్నాను. న‌న్ను విశ్వ‌సించండి. భార‌త‌దేశం చేసేది ఏదైనా స‌రే దాని ని ప్ర‌పంచం నిశితం గా ప‌రిశీలిస్తుంది. నిఘంటువు లోని ప‌దాల అర్థాన్ని మార్చివేసే శ‌క్తి ఈ దేశాని కి ఉంది. ‘అభినంద‌న్‌’ అనే మాట‌కు అభినంద‌న‌ లు అని అర్థం. కానీ, ప్ర‌స్తుతం ఈ మాట‌ కు ఒక వేరే అర్థం జతపడుతుంది. ఇదీ ఈ దేశం యొక్క బ‌లం.

రండి; మ‌నం ఈ విశ్వాసం తో ప‌య‌నిద్దాము. ఒక శ‌క్తిమంత‌మైన దేశం గా మ‌నం ముందుకు సాగ‌వ‌ల‌సివుంది. ఒక కాల బ‌ద్ధ‌ విధానం లో క‌ల‌ల‌ ను ఒక‌దాని త‌రువాత మ‌రొక‌టి గా పండించుకొనేందుకు మ‌నం అడుగులు వేయ‌వ‌ల‌సివుంది. ప్ర‌భుత్వం మీ వెన్నంటి నిల‌బడింది.

ఈ స‌మావేశం లో పాలుపంచుకొన్నందుకు గాను మీ అంద‌రి కీ మ‌రొక్క‌మారు ఇవే నా శుభాకాంక్ష‌లు.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.