పిఎంఇండియా
నవీకరణ యోగ్య శక్తి రంగం లో గినీ కి మరియు భారతదేశాని కి మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పందాని(ఎంఒయు) కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
లక్ష్యం:
ఈ ఎంఒయు లక్ష్యాలు దిగువ తెలిపిన విధం గా ఉన్నాయి:
i. ఒక సహకార పూర్వక సంస్థాగత సంబంధం నెలకొనడం కోసం ప్రాతిపదిక ను ఏర్పాటు చేయడం.
ii. రెండు పక్షాల మధ్య పరస్పర లాభం, సమానత్వం మరియు అన్యోన్యత ల ఆధారం గా నవీకరణ యోగ్య శక్తి రంగం లో ద్వైపాక్షిక సహకారాన్ని మరియు సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడం.
iii. సహకరించుకొనే రంగాల లో సౌర శక్తి, పవన శక్తి, బయో-ఎనర్జీ, చెత్త నుండి శక్తి, చిన్న స్థాయి హైడ్రో స్టోరేజి మరియు సామర్ధ్య నిర్మాణం వంటివి ఉన్నాయి.
ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం లో సైతం ఈ అవగాహనపూర్వక ఒప్పందం తోడ్పడుతుంది.
***