Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పంజాబ్లోని రౌని వ్యవసాయ క్షేత్రానికి భూకేటాయింపు


ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి పంజాబ్లో పశుగ్రాస పెంపుదలకు ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రౌని (పాటియాలా) పశువుల క్షేత్రానికి దాదాపు 72 ఎకరాలను కేటాయించింది. నాభాలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఆన్ బఫెలోస్ (సీఐఆర్బీ)కు చెందిన ఈ భూమిని మళ్లీ రౌని క్షేత్రానికి బదలాయించారు. ఈ వ్యవసాయ భూమంతా సీఐఆర్బీకి ఆనుకుని ఉంది.

ఈ భూమిని పంజాబ్ పశుసంవర్థక శాఖకు బదలాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు పశుగ్రాస అభివృద్ధికి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. పంజాబ్లోని పశుగ్రాస పెంపుదలకు సీఐఆర్బీ/ఐసీఏఆర్ సాంకేతిక సహాయం అందిస్తుంది. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విశాల పశువుల క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రౌనిలోని పశువుల క్షేత్రం 300 పశువులకు మాత్రమే పశుగ్రాసాన్ని అందించగలదు. ఈ నేపథ్యంలో గతంలో సీఐఆర్బీకి లీజుకు ఇచ్చిన భూమిని మళ్లీ రౌని క్షేత్రానికి కేటాయిస్తూ తాజాగా కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

***