Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పన్నులకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి భారతదేశానికి, మాల్దీవులకు మధ్య ఒప్పందం


పన్నులకు సంబంధించిన సమాచారాన్ని భారతదేశం, మాల్దీవులు ఒక దేశానికి మరొక దేశం ఇచ్చి, పుచ్చుకోవడానికి వీలుగా ఒక ఒప్పందంపై జరిగిన సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది.

ఈ ఒప్పందం పన్ను చెల్లింపుల ఎగవేతను, పన్ను కట్టడం మానివేయడాన్ని నివారించడంలో ఉపయోగపడే సమాచారాన్ని ఇరు దేశాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలు కల్పిస్తుంది.