పిఎంఇండియా
రాజ్యసభ ఎంపీ శ్రీ నితిన్ నబీన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పరివర్తన ప్రధానంగా సాగిన 12 సంవత్సరాల పరిపాలనపై అభిప్రాయాలను వివరిస్తూ ఆ వ్యాసం సాగింది. ఉమ్మడి సంకల్పం, సమ్మిళిత అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం… ఇవి కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యసాధన మార్గంలో భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్న తీరును కూడా ఈ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏళ్ల పరివర్తనాత్మక పరిపాలనకు సంబంధించి రాజ్యసభ ఎంపీ శ్రీ నితిన్ నబీన్ అభిప్రాయాల్ని ఈ వ్యాసం వివరించింది. అంతేకాకుండా ఉమ్మడి సంకల్పం, సమ్మిళిత అభివృద్ధి, ప్రజాభాగస్వామ్యం… ఇవి ఏ విధంగా కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, వికసిత్ భారత్ లక్ష్యసాధన మార్గంలో భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయో కూడా ఈ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించింది’’ అని పేర్కొన్నారు.
This article by Rajya Sabha MP Shri @NitinNabin shares thoughts on 12 years of transformative governance under PM @narendramodi, also highlights how collective resolve, inclusive development and citizen participation have accelerated India's journey towards becoming a Viksit… pic.twitter.com/NVcsmFi7fK
— PMO India (@PMOIndia) June 10, 2026