Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పవిత్ర యాత్ర సందర్భంగా.. అయిదు సంకల్పాలతో అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధానమంత్రి లేఖ


ఈ యేడు అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి తీర్థయాత్ర అన్నివిధాలా సురక్షితంగా, మంగళప్రదంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘హిమలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర.. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో, సాంస్కృతిక ఏకతలో శాశ్వతమైన అధ్యాయం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

పవిత్ర యాత్రలో అయిదు సంకల్పాలు చెప్పుకోవాలని కోరుతూ.. యాత్రికులకు తాను లేఖ రాసినట్టు ప్రధానమంత్రి తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘హిమలింగాన్ని దర్శించుకునే శ్రీ అమర్‌నాథ్ యాత్ర.. మన ఆధ్యాత్మిక పరంపర, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వత అధ్యాయం. శివభక్తులకు ఈ యాత్ర అన్ని విధాలా సురక్షితంగా, మంగళప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ శుభసందర్భంగా భక్తుల కోసం అయిదు సంకల్పాలతో నేనొక లేఖ రాశాను…’’

 

***