పిఎంఇండియా
పశ్చిమాసియాలో ఘర్షణను ముగించే విషయంలో అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయాలకు ఈ ఘర్షణ కారణమైందనీ, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి దారితీసిందనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించడంతోపాటు నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను నెలకొల్పడంలోనూ ఈ అవగాహన దోహదపడుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
మిగిలిన అంశాలపైనా చర్చలు జరిగి.. ఒక సుస్థిరమైన తుది ఒప్పందం కూడా కుదురుతుందని భారత్ ఆశిస్తోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అవాంతరాలకూ, అనేక దేశాల్లో ప్రాణ నష్టానికీ కారణమైన పశ్చిమాసియా ఘర్షణకు ముగింపు పలికే విషయమై అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను స్వాగతిస్తున్నాను.
ఆ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించడంతోపాటు.. నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను నెలకొల్పడంలోనూ ఈ అవగాహన ఎంతగానో దోహదపడుతుందని భారత్ ఆశిస్తోంది.
మిగిలిన అంశాలపైనా చర్చలు జరిగి.. ఒక సుస్థిరమైన తుది ఒప్పందం ఇరుదేశాల మధ్య కుదురుతుందని మేం భావిస్తున్నాం.”
***
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
— Narendra Modi (@narendramodi) June 15, 2026
India hopes that the implementation of this understanding will…