Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ ప్రమాదం… ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని


పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి తన సానుభూతిని తెలియజేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని ప్రకటించారుగాయపడిన వారికి రూ.50,000 అందజేస్తారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం:

‘‘పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో పడవ మునిగిన ఘటనలో ప్రాణ నష్టం జరగడం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందిబాధిత కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకి రూ.2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని అందిస్తారు’’

 

***