Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాక‌ల్ దుల్ విద్యుత్తు ప్రాజెక్టుకు కు శంకుస్థాప‌న మరియు జ‌మ్ము లో అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

పాక‌ల్ దుల్ విద్యుత్తు ప్రాజెక్టుకు కు శంకుస్థాప‌న మరియు జ‌మ్ము లో అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

పాక‌ల్ దుల్ విద్యుత్తు ప్రాజెక్టుకు కు శంకుస్థాప‌న మరియు జ‌మ్ము లో అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం


ప్రియ‌మైన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఇక్క‌డ ఎంతోమంది పాత‌ త‌రం ప్ర‌ముఖులు క‌నిపిస్తున్నారు. మ‌న చ‌మ‌న్‌ లాల్‌ గారు ఇక్క‌డ ఉన్నారు. జ‌మ్ము & కశ్మీర్‌ కు ఇది ఎంతో ముఖ్య‌మైన రోజు. రాష్ట్రంలో నేను పాల్గొంటున్న నాలుగో బ‌హిరంగ స‌భ‌. ఉద‌యం నుండి నేను లేహ్‌- ల‌ద్దాఖ్ ప‌ర్వ‌త శిఖ‌రాల‌ నుండి కశ్మీర్ లోయ వ‌ర‌కు ఇప్పుడు జ‌మ్ము పాదాల వ‌రకు అభివృద్ధి ప్ర‌వాహాన్ని చూశాను. ఈ కార్య‌క్ర‌మాల కార‌ణంగా నాకు ఆల‌స్య‌ం అయింది. నేను ఇక్క‌డకు స‌కాలంలో రాలేక‌పోయాను. ఇందుకు న‌న్ను మ‌న్నించవలసిందిగా మిమ్మ‌ల్ని వేడుకొంటున్నాను.

లేహ్ తో భార‌త‌దేశాన్ని అనుసంధానం చేసే జోజిలా సొరంగం కానివ్వండి, లేదా బాందీపోరా లోని కిశన్ గంజ్ ప్రాజెక్టు కానివ్వండి లేదా కిశ్త్ వాడ్ ప్రాంతం లో చీనాబ్ న‌దిపై నిర్మిత‌మౌతున్న‌ జల విద్యుత్తు ప్రాజెక్టు కానివ్వండి ఇవ‌న్నీ జ‌మ్ము & కశ్మీర్‌ ఆనందానికి కొత్త ద్వారాలు తెర‌వ‌నున్నాయి. ఈ రాష్ట్రం మీదుగా ప్ర‌వ‌హిస్తున్న న‌దులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని వేగ‌వంతం చేయ‌నున్నాయి. ఒక జ‌ల‌ విద్యుత్తు పథకాన్ని దేశ ప్రజలకు అంకితం చేయ‌డం, మ‌రో పథకానికి శంకుస్థాప‌న చేయ‌డం ఈ రోజు కు ప్ర‌త్యేక‌త‌ను తెచ్చిపెట్టి చిర‌స్మ‌ర‌ణీయం చేశాయి. కొద్దిసేప‌టి క్రితం, జ‌మ్ముకు సంబంధించిన నాలుగు భారీ మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ను దేశ ప్రజలకు అంకితం చేయ‌డానికి లేదా శంకుస్థాప‌న చేయ‌డానికి నాకు అవ‌కాశం ద‌క్కింది. ఇందులో రెండింటిని మాతా వైష్ణోదేవికి అంకితం చేశాము. కొద్దిసేప‌టి క్రితం ఇక్క‌డ‌ పాక‌ల్‌ దుల్ ప్రాజెక్టు కు శంకుస్థాప‌న చేశాం. ఈ ప్రాజెక్టు వ‌ల్ల రాష్ట్రానికి ఎంతటి ప్ర‌యోజ‌న‌మో మీరు అర్థం చేసుకోగ‌ల‌రు. ఇది ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఒక రోజులో ఉత్ప‌త్తి అవుతున్న‌ విద్యుత్తు లో మూడో వంతు విద్యుత్తు కు స‌మానమైన విద్యుత్తును ఉత్ప‌త్తి చేయ‌నుంది. పాక‌ల్‌ దుల్ ప్రాజెక్టు ను ప్ర‌ధాన‌ మంత్రి అభివృద్ధి నిధి నుండి నిర్మించారు. ఈ వెయ్యి మెగావాట్ల సామ‌ర్ధ్యం గ‌ల ప్రాజెక్టు ప‌నులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 8000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో చేప‌ట్ట‌నున్న ఈ ప‌థ‌కం ఈ ప్రాంతం లో పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించ‌నుంది. ఇది ప్ర‌త్య‌క్షంగా 2500 మందికి ఉపాధి క‌ల్పిస్తుంది. దీనికి తోడు కాయగూర‌లు సాగు చేసే వారు, పాల ఉత్ప‌త్తిదారులు.. ఇలా ఎంద‌రో ఉంటారు. ఇక్క‌డ ఏ ప‌ని ని చేసుకునే వారికి అయినా స‌రే రాబ‌డికి కొత్త‌ అవ‌కాశాలను ఈ ప్రాజెక్టు క‌ల్పించ‌నుంది.

మిత్రులారా,

మ‌న ప్ర‌భుత్వం దేశాభివృద్ధి విష‌యంలో నూత‌న పంథా తో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒంట‌రిత‌నం నుండి అనుసంధాన‌ం అనేది మా విధానం. అంటే ఏదో కార‌ణంతో ఒంటరి కాబ‌డిన దేశం లోని ప్రాంతాలు, ఇప్ప‌టి వ‌ర‌కు అభివృద్ధి వెలుగుల‌కు నోచుకోని ప్రాంతాల‌ను గుర్తించి ఇప్ప‌డు అలాంటి ప్రాంతాల‌కు ప్రాధాన్య‌మివ్వ‌డం జ‌రుగుతోంది. ఈ కార‌ణం తోనే అది ఈశాన్య ప్రాంతం కానివ్వ‌ండి, జ‌మ్ము & కశ్మీర్‌ కానివ్వండి- నేను స్వ‌యంగా అక్క‌డ ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను.

ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప్ర‌ధాన మంత్రికి అయినా ఇలాంటి అవ‌కాశం ద‌క్కిందో లేదో నాకు తెలియ‌దు. ఇప్ప‌టివ‌ర‌కు నేను రాజ‌కీయ ప‌ర్య‌ట‌న‌ల‌కు తోడు ప్ర‌ధాన‌ మంత్రి గా జ‌మ్ము & కశ్మీరుకు డ‌జ‌ను సార్ల‌కు పైగా వ‌చ్చాను. మీరు ఇంత‌కు ముందు మీరు న‌న్ను బాగా చూసుకున్నారు. ఆ ర‌కంగా మీరు న‌న్ను ఎదిగేలా చేశారు. మ‌నం అనుసంధాన‌ం ద్వారా అభివృద్ధి అనే సూత్రాన్ని అమ‌లు చేస్తున్నాము. ఆ అనుసంధాన‌త రహదారుల ద్వారా కావ‌చ్చు, లేదా హృద‌యాల‌ను క‌ల‌ప‌డం కావ‌చ్చు- ఏ స్థాయిలోనూ ఇందుకు ద‌క్కిన ఏ అవ‌కాశాన్నీ వదలివేయడం లేదు. ఈ దిశ‌గా ప‌డుతున్న ప్రతి అడుగు, జ‌మ్ము & కశ్మీర్‌ అభివృద్ధి కోసమే. న్యూ ఇండియా లో ప్ర‌కాశ‌వంతమైన న‌క్ష‌త్రంగా వెలుగొందే శ‌క్తి దీనికి ఉంది. భార‌త‌దేశ కిరీటం వజ్రాభ‌ర‌ణాల‌తో త‌యారైన‌ట్టు మెరిసిపోతుంటే, ఈ మెరుపులు మిగిలిన దేశం మొత్తానికి అబివృద్ది ప‌థాన్ని చూప‌డాన్నిద‌ర్శిస్తూ భార‌త‌దేశ చిత్ర‌ప‌టాన్ని ఊహించి చూద్దాము.

సోదర సోద‌రీమ‌ణులారా, ఈ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర‌ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తున్న‌ది. మేం ఈ ప‌థ‌కాల‌ను ముందుకు తీసుకుపోతూ వాటిని క్షేత్ర‌ స్థాయి లో అమ‌లు చేస్తున్నాము. కొద్దిసేప‌టి క్రిత‌మే, రింగ్‌ రోడ్డు కు శంకుస్థాప‌న చేశాము. ఇది జ‌మ్ము ప‌ట్ట‌ణ ప్రజల, ఈ ప్రాంత‌ ప్ర‌జ‌ల ట్రాఫిక్ జామ్‌ ల స‌మ‌స్య‌ ను తీరుస్తుంది. రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు కృషి చేయ‌డం జ‌రుగుతుంది. రింగ్ రోడ్డు పూర్త‌ి అయితే మీకు ఎన్నో సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌స్తాయి.

జ‌మ్ము వాసుల‌కు, ఇక్క‌డకు వ‌చ్చే ల‌క్ష‌లాది ప‌ర్యాట‌కుల‌కు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. రహదారికి ఇరు వైపులా కొత్త జ‌మ్ము ను చూడ‌వ‌చ్చు. దీనితో ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి విస్త‌ర‌ణ జ‌రుగుతుందో నేను స్ప‌ష్టంగా ద‌ర్శించ‌గ‌లుగుతున్నాను.

జ‌మ్ము నగరం స‌మీపంలో అలాగే జమ్ము న‌గ‌రంలోప‌ల ట్రాఫిక్ జామ్‌ల‌ను ఇది త‌ప్ప‌కుండా త‌గ్గిస్తుంది. అంతేకాదు, సైనిక వాహ‌నాల ద్వారా భారీ యంత్రాల‌ను పూంచ్‌, రాజౌరి, నౌశేరా, అఖ్నూర్ ల వంటి వ్య‌ూహాత్మ‌క‌, స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డానికి సుల‌భంగా ఉంటుంది.

మిత్రులారా, మీ జ‌మ్ము న‌గ‌రాన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కై ఎంపిక చేయ‌డం జ‌రిగింది. ట్రాఫిక్ నుండి మురుగు నీటి పారుద‌ల నిర్వ‌హ‌ణ వ‌ర‌కు స్మార్ట్ వ్య‌వ‌స్థ‌ లు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఈ ప‌నిలో ఉంది. ఇందుకు సంబంధించిన నిధుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆమోదించింది.

సోద‌ర‌ సోదరీమ‌ణులారా, అభివృద్ధి విష‌యంలో- మా మొత్తం దృష్టి అంతా మౌలిక‌ స‌దుపాయాల అభివృద్ధి పైనే. అది జాతీయ‌ర‌హ‌దారుల అభివృద్ధి లేదా ,రైల్వేలు లేదా జ‌ల‌మార్గాలు లేదా ఐ వేస్‌, లేదా రోడ్‌వేస్ ఇలా ఏవైనా కానివ్వండి, 21వ శ‌తాబ్దాని ఇక ఇవన్నీ త‌ప్ప‌కుండా అవ‌స‌రం. ప్ర‌భుత్వ ఆలోచ‌న ఎంతో స్ప‌ష్టంగా ఉంది. మ‌నం 125 కోట్ల మంది ఈ దేశ ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచాలంటే అందుకు మ‌నం ముందుగా దీనిని వారికి సుల‌భ‌త‌రంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండేట్టు చేయాలి. మ‌రో మాట‌లో చెప్పాలంటే వీటిని స్మార్ట్ వ్య‌వ‌స్థ‌లు అని అన‌వ‌చ్చు. ఈ ఆలోచ‌న‌ల ఫ‌లితంగానే భార‌త్ మాలా ప్రాజెక్టు లో భాగంగా దేశ వ్యాప్తంగా రోడ్స్ నెట్‌వ‌ర్క్‌ ను శ‌ర‌వేగంతో అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. అది, జ‌మ్ము & కశ్మీర్‌ కానివ్వండి, లేదా ప‌శ్చిమ భార‌త‌దేశం లేదా ఈశాన్య ప్రాంతం కానివ్వండి, ఇది నేశనల్ రోడ్ నెట్‌వ‌ర్క్‌ తో దేశాన్ని అనుసంధానం చేస్తుంది. ఈ సంవత్సర బ‌డ్జెటు లో ఈ ప్రాజెక్టు లో భాగంగా 35,000 కిలోమీట‌ర్ల మేర‌కు రహదారుల నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా కేటాయించాము. ఈ ప్రాజెక్టు లో భాగంగా 2,700 కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డిన నిధుల‌ను జ‌మ్ము & కశ్మీర్‌ లో ఖ‌ర్చుచేయ‌డం జ‌రుగుతుంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, జ‌మ్ము & కశ్మీర్‌ లో కూడా ప‌లు హైవేల ప్రాజెక్టులు అమ‌లుజ‌రుగుతున్నాయి. జ‌మ్ము నుండి శ్రీ‌న‌గ‌ర్‌ ను, దేశం లోని ఇత‌ర ప్రాంతాల‌ను క‌లిపే ప‌లు ర‌హ‌దారుల ప్రాజెక్టులు ఇప్ప‌టికే పూర్త‌ి అయ్యాయి. మ‌రి కొన్ని ప‌థ‌కాల విష‌యంలో ప‌నులు శ‌ర‌వేగంతో జ‌రుగుతున్నాయి.
జ‌మ్ము- పూంచ్‌, ఉదంపుర్‌- రామ్‌బ‌న్‌, శ్రీ‌న‌గ‌ర్‌- బ‌నిహాల్‌, కాజిగుండ్‌- బ‌నిహాల్ మ‌ధ్య ప‌లు హైవే ప్రాజెక్టు ప‌నులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి జీవ‌న రేఖ‌గా నిల‌వ‌నున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి సుమారు 15,000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేయ‌డం జ‌రుగుతుంది. దీనికి తోడు, ప్ర‌ధాన‌ మంత్రి గ్రామీణ రోడ్ల ప‌థ‌కం లో భాగంగా గ్రామాల‌కు రహదారి సౌక‌ర్యం క‌ల్పింప‌బ‌డుతోంది. గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లో ఈ ప‌థ‌కంలో ల‌క్ష కిలోమీట‌ర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం జ‌రిగింది. జ‌మ్ము & కశ్మీర్‌ లో గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లో 3,500 కిలోమీట‌ర్ల రహదారుల నిర్మాణంతో గ్రామాల‌ను అనుసంధానం చేయ‌డం జ‌రిగింది.

మిత్రులారా, జ‌మ్ము & కశ్మీర్‌ కు ప‌ర్యాట‌క ఆదాయం పెద్ద రాబ‌డి వ‌న‌రు. ముఖ్యంగా- మ‌త విశ్వాసాల‌తో ముడిప‌డిన బాబా బ‌ర్ఫాని (మ‌హాశివుడు) కావచ్చు లేదా మాతా రాణి ( వైష్ణోదేవి మాత‌) ద‌ర్బార్ కావ‌చ్చు- ఈ పవిత్ర మందిరాల‌ను ద‌ర్శించ‌డానికి ల‌క్ష‌లాది ప‌ర్యాట‌కులు త‌ర‌లి వస్తుంటారు. ఈ ప‌ర్యాట‌కుల‌కు సకల సౌక‌ర్యాలను క‌ల్పించేందుకు, స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

ఈ రోజున క‌ట్ రా లోని వైష్ణో దేవి పుణ్య‌క్షేత్రానికి రైలు సౌక‌ర్యం అందుబాటు లోకి వ‌చ్చింది. నేను ప్ర‌ధాన‌ మంత్రి ని కాగానే ఈ రైలు మార్గాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేసే అదృష్టం నాకు వెంట‌నే దక్కింది. ఈ రైలు మార్గం కార‌ణంగా వైష్ణో దేవి మాత భక్తులు వారి యాత్ర‌ ను కొన‌సాగించ‌డం చాలా సులువు అవుతోంది. ఇంత‌టి తోనే ఆగిపోవాల‌ని మేము అనుకోవ‌డం లేదు. అందుకే ఈ రోజున మ‌రో రెండు భారీ ప్రాజెక్టుల‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. ఒకటో ప్రాజెక్టు మాతా వైష్ణో దేవి ని సంద‌ర్శించ‌డానికి ఉప‌యోగ‌ప‌డే మ‌రో మార్గం యొక్క నిర్మాణానికి సంబంధించింది. ఇక రెండో ప్రాజెక్టు మాత ఆలయానికి అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను చేరవేసేందుకు ఒక రోప్ వే ను నిర్మించడానికి సంబంధించింది.

మిత్రులారా, మాతా వైష్ణోదేవి ఆల‌యాన్ని సంద‌ర్శించాల‌నుకునే భ‌క్తులు ఇప్పుడు తారాకోటా మార్గం ద్వారా అక్క‌డ‌కు చేరుకోవ‌చ్చు. క‌త్రా నుండి అర్ధ్ కున్వారి వ‌ర‌కు న‌డ‌క మార్గం ద్వారా ప‌య‌నించే భ‌క్తుల‌కు ఇది ఐచ్ఛిక మార్గం. ఈ మార్గం ద్వారా ప‌య‌నించే వారికి భ‌క్త స‌మూహాల కార‌ణంగా వ‌చ్చే స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఈ మార్గాన్ని, ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న‌ న‌డ‌క దారిని క‌ల‌ప‌డం కోసం ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్ల పొడ‌వైన లింకు రోడ్డు తో సంధానిస్తార‌ని నాకు చెప్పారు. కాబ‌ట్టి భ‌క్తులు దేవాల‌యాన్ని చేరుకోవ‌డానికి ఏదో ఒక న‌డ‌క దారిని ఎంచుకోవ‌చ్చు. ఇది అమ్మ‌ వారి భ‌క్తుల‌కు పూర్తిగా భ‌ద్ర‌మైన మార్గం. వారికి కావలసిన అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను ఈ మార్గంలో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

మిత్రులారా, ఈ ప్ర‌త్నామ్నాయ మార్గంతో పాటు వ‌స్తువుల స‌ర‌ఫ‌రా కు ఉప‌యోగించే రోప్ వే ను ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. ఈ రోప్ వే ను నేరుగా అమ్మ‌ వారి ఆల‌య గుమ్మం దాకా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ వ‌స్తువుల రోప్ వే కార‌ణంగా వ‌స్తువుల స‌ర‌ఫ‌రా చాలా సులువు అవుతుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆల‌య బోర్డు ఈ ప్ర‌త్యేక‌మైన సౌక‌ర్యాల‌ను ఉప‌యోగించుకొని పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఆహారాన్ని అందించడానికి వీలుగా ఏర్పాట్ల‌ను చాలా సాఫీ గా చేసుకోగ‌లుగుతుంది. ఆల‌యానికి చుట్టుప‌క్క‌ల ఏర్ప‌డే చెత్తా చెదారాన్ని స‌మీక‌రించి ఈ రోప్ వే ద్వారా బయట‌కు త‌ర‌లించ‌వ‌చ్చు. క‌త్రా నుండి వస్తువుల‌ను స‌ర‌ఫ‌రా చేసిన త‌రువాత దీనికి సంబంధించిన తిరుగు ప్ర‌యాణంలో చెత్త‌ ను వెనుకకు తీసుకు రావ‌డం జ‌రుగుతుంది.

మిత్రులారా, మెటీరియ‌ల్ రోప్ వే మాదిరిగానే భ‌క్తుల‌ కోసం ఇలాంటి సౌక‌ర్యాన్ని అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతోంది. రూ.60 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న భైరో ఘాటీ భ‌వ‌న్ త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంది. ఈ రోప్ వే గంట‌కు 800 మంది ప్ర‌యాణం చేయ‌డానికి వీలుగా ఉంటుంది. ఇది వృద్ధులకు, దివ్యాంగుల‌కు పూర్తి స‌హాయ‌కారిగా ఉంటుంది. ఈ రోప్ వే పూర్తి స్థాయి లో ప‌ని చేస్తే ఇది మూడు నిమిషాల్లోనే 40- 45 మందిని తీసుకు పోగ‌ల‌దు. ఢిల్లీ మెట్రో లాగానే ఈ రోప్ వే వ్య‌వ‌స్థ‌కు ఆటోమేటిక్ టికెట్ వ్య‌వ‌స్థ ఉంది. భ‌క్తుల‌కు ప‌లు సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయ‌డానికిగాను పుణ్య‌క్షేత్రం బోర్డు చైర్మన్, ఇంకా ఇత‌ర స‌భ్యులు చేస్తున్న కృషి అభినంద‌నీయం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, జ‌మ్ము & క‌శ్మీర్ లో ప్రాథమిక సౌక‌ర్యాలను క‌ల్పిస్తే త‌ద్వారా ప‌ర్యాట‌క రంగం ప్ర‌గ‌తిని సాధిస్తుంది. దాంతో ఈ రాష్ట్రంలో ఉపాధి అవ‌కాశాలు మెరుగుపడతాయి. ఏది ఏమైనా ఉద్యోగం రావాలంటే విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి చాలా ముఖ్యం. ప్ర‌సిద్ధి చెందిన సంస్థ‌లను రాష్ట్ర విద్య రంగంలో స్థాపించేందుకుగాను కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. జ‌మ్ము లో ఏర్పాటు చేసే ఐఐఎమ్ లేదా ఐఐటి వంటి సంస్థ‌లు రాష్ట్ర అభివృద్ధిలో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటాయి. దీనితో పాటు, దేశం లోని ప్ర‌తిష్టాత్మ‌క విశ్వ‌విద్యాల‌యాలలో విద్య‌ ను అభ్య‌సించాల‌నుకొనే జ‌మ్ము & క‌శ్మీర్ విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాల‌ను కూడా అందించ‌డం జ‌రుగుతుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, మ‌హిళా సాధికారిత అనేది ప్ర‌భుత్వానికి ప్రాధాన్య‌త‌ గ‌ల అంశం. మ‌హిళ‌ల‌కు ఆర్ధిక శక్తిని, సాంఘిక శ‌క్తిని అందించ‌డానికిగాను గ‌త నాలుగు సంవ‌త్స‌రాలలో అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. బ్యాంకు పూచీకత్తు లేకుండానే దేశంలోని దాదాపు 9.5 కోట్ల మంది మ‌హిళా నవ పారిశ్రామికులకు రుణాల‌ను అందించ‌డం జ‌రిగింది. ఇలా రుణాలు తీసుకున్న‌ వారిలో 50 ల‌క్ష‌ల‌దద మందికి పైగా జ‌మ్ము & క‌శ్మీర్ మ‌హిళ‌లు ఉన్నారు. అదే స‌మ‌యంలో ఉజ్జ్వల యోజనలో భాగంగా దేశం లోని పేద మ‌హిళ‌ల‌కు ఉప‌యోగ‌పడేలా పొగ కు తావు ఉండనటువంటి పొయ్యిల‌ను అందివ్వ‌డం జ‌రుగుతోంది. గ్రామాల లోని పేద మాతృమూర్తుల‌కు, సోద‌రీమ‌ణులకు- వారు ద‌ళితులు కావ‌చ్చు, అణ‌గారిన వ‌ర్గాలు కావ‌చ్చు- ఈ పేద వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లంద‌రూ పొగ‌ రాని పొయ్యిల‌ ద్వారా వంట చేసుకుంటున్నారు. ఇందుకుగాను వారికి 4 కోట్ల ఎల్ పిజి కనెక్షన్ లను ఉచితంగా ఇవ్వ‌డం జ‌రిగింది. జ‌మ్ము & క‌శ్మీర్ లోని నాలుగు ల‌క్ష‌ల మంది మాతృమూర్తులు, సోద‌రీమ‌ణులు ఉజ్జ్వల ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి ని పొందుతున్నారు.

మిత్రులారా, స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో భాగంగా దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న ఉద్య‌మం వ‌ల్ల‌ బ‌హిరంగ ప్రాంతాలలో మ‌ల‌ విస‌ర్జ‌న కు తావు లేకుండా చేయ‌డం జ‌రుగుతోంది. ఇది ఒక్క పారిశుద్ధ్య కార్య‌క్ర‌మమే కాదు; ఇది మ‌హిళ‌ల గౌర‌వానికి సంబంధించినటువంటి అంశం. ఈ ఉద్య‌మం ప‌ట్ల జ‌మ్ము & క‌శ్మీర్ మ‌హిళ‌లు ఎంతటా చైత‌న్యాన్ని క‌లిగివున్నారో దేశ‌వ్యాప్తంగానే కాదు యావత్తు ప్ర‌పంచం కూడా తెలుసుకుంది. ఉధాంపూర్ లో ఓ 87 సంవ‌త్స‌రాల వృద్ధురాలు మ‌రుగుదొడ్డి నిర్మించ‌డం నేను స్వ‌యంగా చూశాను. ఆమె ఎవ‌రి సహాయాన్ని తీసుకోలేదు. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన ఈ ఉద్య‌మంలో పాల్గొనాల‌నే ఆకాంక్షే ఆమెలో క‌నిపించింది.

మిత్రులారా, ఇలాంటి కృషి జ‌రిగిన‌ప్పుడు ఈ విధమైన కార్య‌క్ర‌మాల కోసం కావలసిన ధైర్యం, నమ్మ‌కం అనేక రెట్లు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో ఐదేళ్ల బాలిక‌లు కూడా ఈ ఉద్య‌మంలో భాగ‌స్వాముల‌య్యారు. మ‌రో చోట 87 ఏళ్ల వృద్ధ మాతృమూర్తి ఈ ఉద్య‌మంలో పాలుపంచుకొన్నారు. ఈ వాస్త‌వాన్ని చూసిన‌ప్పుడు మాత్ర‌మే పారిశుద్ధ్యం, గౌర‌వ మ‌ర్యాద‌ల‌ ప‌ట్ల ఎంత లోతైన ఆలోచ‌న‌లు ఉన్నాయ‌నే విష‌యాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఈ కార‌ణంగానే గ్రామీణ ప్రాంతాలలో స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం 80 శాతానికి పైగా విస్త‌రించింది. ఈ ప‌థ‌కం కింద జ‌మ్ము & క‌శ్మీర్ లో 8.5 ల‌క్ష‌లకు పైగా గృహాల‌కు మ‌రుగుదొడ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది.

మిత్రులారా, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్య‌ం ఇవ్వ‌నంత‌ వ‌ర‌కు మ‌హిళ‌ల ఆర్ధిక‌, సాంఘిక అభివృద్ధి అనేది సంపూర్తిగా జ‌ర‌గ‌దు. ఈ కార‌ణంగానే జ‌మ్ము & క‌శ్మీర్ లోని మ‌హిళ‌ల నైపుణ్యాల అభివృద్ధి కోసం అనేక చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. హ‌స్త‌క‌ళ‌లు, కుట్టు ప‌ని, వ్య‌వ‌సాయ‌ రంగాల‌కు సంబంధించిన వ్యాపారాల‌ను నిర్వ‌హించ‌డానికిగాను 5,000 మంది మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, రెండు సంవ‌త్స‌రాల క్రితం నేను ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఈ ప్రాంత యువ‌తీయువకులకు ఒక విన్నపం చేశాను. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలను పూర్తి స్థాయి లో ఉప‌యోగించుకోవలసిందిగా కోరాను. నా విజ్ఞ‌ప్తి మేర‌కు వారు ఆ ప‌ని చేస్తున్నారు. ఈ ప్రాంత యువ‌త ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను సంపూర్ణంగా ఉప‌యోగించుకుంటున్నారు. ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ ప‌థ‌కం లో భాగంగా 20 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు బ్యాంకు ఖాతాలను తెరచారు. ఈ ఖాతాలలో దాదాపు రూ.800 కోట్ల‌ను డిపాజిట్ చేయ‌డం జ‌రిగింది. నేను మాట్లాడుతున్న‌ది ఒక్క జ‌మ్ము & క‌శ్మీర్ ను గురించి మాత్ర‌మే. ఈ రాష్ట్రానికి చెందిన 40 వేల మందికి పైగా నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులు అట‌ల్ పెన్షన్ ప‌థ‌కం లో చేరారు. వీరు అవ్య‌వ‌స్థీకృత రంగాల‌కు చెందిన కార్మికులు. వారి కోస‌మే ఈ ప‌థ‌కాన్ని రూపొందించాము. రాష్ట్రానికి చెందిన 9 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు అతి త‌క్కువ ప్రీమియమ్ ను చెల్లించే ప‌థ‌కాలలో చేరారు. వీటిని ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తోంది. ఈ ప‌థ‌కాల లో భాగంగా సుమారు రూ. 3 కోట్ల‌ు ఈసరికే వితరణ చేయడం జ‌రిగింది.

మిత్రులారా, సైనిక ద‌ళాల్లో చేర‌డానికి ఈ ప్రాంత యువత ఎప్పుడూ ముందుంటోంది. ఇక్క‌డి సంప్ర‌దాయం ప్ర‌కారం సైనిక ద‌ళాల్లో చేరే యువ‌త కోసం అనేక అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింది. ప్ర‌త్యేకంగా ఉద్యోగ నియామ‌క కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం ద్వారా సైన్యం, కేంద్ర సాయుధ ద‌ళాలు, పోలీసు బ‌లగాలు, భారతీయ రిజ‌ర్వ్ బెటాలియ‌న్ లలో 20,000 మందికి పైగా రాష్ట్ర యువ‌త‌ను చేర్చుకోవ‌డం జ‌రిగింది.

మిత్రులారా, ఇది డోగ్రా ల భూమి. ఇది ధైర్య‌వంతుల గడ్డ. ఇక్క‌డ పరాక్రమంతో పాటు ఓర్మి సైతం ఉంది; అలాగే, మ‌ధుర‌మైన సంగీతమూ ఉంది. బాసుమతి వరి పొలాల నుండి వీచే పరిమళం, మరి అదే విధంగా ఆధునిక కర్మాగారాల స్థాప‌న‌ కు అవ‌కాశం కూడా ఉంది. మా సంకల్పం దృఢమైంది మరి మా మార్గమూ స‌రైందే. మాతా వైష్ణో దేవి దివ్య ఆశీస్సుల తోను, ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ఠోర శ్రమ తోను ఈ రాష్ట్రం ప్ర‌గ‌తి తాలూకు నూతన శిఖరాలను అందుకోవాలని, మరి ఈ రాష్ట్రం త‌ప్ప‌క విజ‌యాన్ని సాధిస్తుంద‌నడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.

మీకు ధన్యవాదాలు.

***