పిఎంఇండియా
పాదరసంపై మినమాటా ఒప్పందాన్ని ధ్రువీకరించే ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, ఈ ఒప్పందంలో భారతదేశాన్ని భాగస్వామిని చేసేందుకు వీలు కల్పించే ఒప్పంద ధ్రువీకరణను సమర్పించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఈ ఆమోదం వల్ల పాదరసంపై మినమాటా సదస్సు తీర్మానాన్ని ధ్రువీకరించడంతో పాటు పాదరసం ఆధారిత ఉత్పత్తులు, పాదరసం తో కూడిన ప్రక్రియ లను 2025 వరకు ఉపయోగించుకొనే వీలు కలుగుతుంది.
పాదరసంపై మినమాటా సదస్సు ఒప్పందాన్ని- మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణం లోకి వెదజల్లబడే కాలుష్యం మరియు కశ్మలాల బారి నుండి, పాదరసం మరియు పాదరస సంబంధి ఉత్పత్తుల బారి నుండి ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని- అమలు చేయడం జరుగుతుంది.
ఈ ఒప్పందం సమాజం లోని పేదలను పాదరసం దుష్ప్రభావాలకు గురి కాకుండా కాపాడడంతో పాటు వర్ధమాన దేశాల అబివృద్ధిని పరిరక్షిస్తుంది. అంటే దీని వల్ల పేదలు మరియు సమాజం లోని అణగారిన వర్గాలు రక్షింపబడతారు.
పాదరసంపై మినమాటా సదస్సు వివిధ ఉత్పత్తులలో పాదరసాన్ని వినియోగించకుండా ఉండే ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచించాలని, తయారీ రంగ ప్రక్రియలలో పాదరసం వాడని సాంకేతిక పరిజ్ఞానం మీద దృష్టి పెట్టాలని కూడా పిలుపునిస్తోంది. ఇది ఈ దిశగా పరిశోధనలకు మరియు అభివృద్ధికి చోదకం కావడంతో పాటు
నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని కూడా అందించగలదు.