పారా ఆసియా క్రీడల 400 మీటర్ల టీ64 విభాగంలో కాంస్య పతకం సాధించిన అజయ్ కుమార్‌కు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ట్రాక్‌పై ఆయన కనబరిచిన ప్రదర్శన భారతదేశానికి మరొక గర్వకారణమైన క్షణాన్ని తెచ్చిపెట్టిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన తన పరిమితులను అధిగమించి భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“పారా ఆసియా క్రీడల పురుషుల 400 మీటర్ల టీ64 విభాగంలో కాంస్య పతకం సాధించిన అజయ్ కుమార్‌కు అభినందనలు! ట్రాక్‌పై ఆయన కనబరిచిన ప్రదర్శన భారతదేశానికి మరొక గర్వకారణమైన క్షణాన్ని తెచ్చిపెట్టింది. ఆయన భవిష్యత్తులోనూ తన పరిమితులను అధిగమించి మరింత అపారమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: PM @narendramodi”
Congratulations to Ajay Kumar on winning Bronze in the Men’s 400m T64 event at the Asian Para Games! His performance on the track has brought another moment of pride for India. May he continue to push boundaries and achieve greater success: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026