Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పారా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన అజయ్ కుమార్‌ను అభినందించిన ప్రధానమంత్రి


పారా ఆసియా క్రీడల 400 మీటర్ల టీ64 విభాగంలో కాంస్య పతకం సాధించిన అజయ్ కుమార్‌కు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ట్రాక్‌పై ఆయన కనబరిచిన ప్రదర్శన భారతదేశానికి మరొక గర్వకారణమైన క్షణాన్ని తెచ్చిపెట్టిందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన తన పరిమితులను అధిగమించి భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“పారా ఆసియా క్రీడల పురుషుల 400 మీటర్ల టీ64 విభాగంలో కాంస్య పతకం సాధించిన అజయ్ కుమార్‌కు అభినందనలు! ట్రాక్‌పై ఆయన కనబరిచిన ప్రదర్శన భారతదేశానికి మరొక గర్వకారణమైన క్షణాన్ని తెచ్చిపెట్టింది. ఆయన భవిష్యత్తులోనూ తన పరిమితులను అధిగమించి మరింత అపారమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: PM @narendramodi”