పిఎంఇండియా
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన పాశవికమైన దాడిని తీవ్ర స్వరంతో ఖండిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. పారిస్ నగరంలో ప్రజలు తమకిష్టమైన పనుల్లో నిమగ్నమై ఉండగా, తమ ఆప్తులతో కాలం గడుపుతుండగా జరిగిన ఈ రాక్షస మూకల దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ” ఫ్రాన్స్ ప్రజలు అనుభవిస్తున్న బాధ, ఆగ్రహం, దిగ్ర్భాంతిని మేము అర్థం చేసుకోగలం ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనడంలో సాహసవంతులైన ఫ్రాన్స్ ప్రజల వెనుక మేం అండగా నిలుస్తున్నాం. మానవాళి ఎదుర్కొంటున్న ఈ దారుణమైన ముప్పును వర్తమాన ప్రపంచం సంఘటితంగా ఎదుర్కొని జీవితంలో విలువల్ని కాపాడుకుంటూ, జీవన గమనాన్ని నిర్దేశించుకునేందకు కృషి చేయాల్సి ఉంది” అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.
My heart is filled with sadness due to what happened in Paris. This was an attack on entire humanity & humanitarian forces: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 14, 2015