పిఎంఇండియా
నమస్కారాలు మిత్రులారా,
ఇది 2019వ సంవత్సరం లో ఆఖరి సమావేశం. మరి ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం కూడాను ఎందుకంటే ఇది రాజ్య సభ యొక్క 250వ సమావేశం. రాజ్య సభ యొక్క 250వ సమావేశం తన 250 సమావేశాల యొక్క యాత్ర తాలూకు ప్రేరణాత్మకమైనటువంటి జ్ఞాపకాల తో ఆరంభం అవుతోంది. అదే విధం గా, ఈ సమావేశం సందర్భం లోనే, 26వ తేదీ నాడు, మన రాజ్యాంగ దినం రానుంది. మనం మన రాజ్యాంగం యొక్క 70 సంవత్సరాలు అవుతున్న ఘట్టాన్ని జరుపుకోబోతున్నాము. ఈ రాజ్యాంగం భారతదేశం యొక్క ఏకత, అఖండత, వివిధత్వం మరియు సుందరతల ను తన లోపల ఇముడ్చుకోవడం తో పాటు దేశాన్ని ముందుకు నడిపించే శక్తి గా కూడా ఉంది. అందుకని రాజ్యాంగాని కి 70 సంవత్సరాలు అనే సన్నివేశం లో ఈ సభ అనే మాధ్యమం ద్వారా దేశ ప్రజలు జాగృతం కావడానికి ఒక అవకాశం గా మారవచ్చును. గడచిపోయిన కాలం లో, దాదాపు అన్ని రాజకీయ పక్షాల నేతలతో భేటీ అయ్యే అవకాశం చిక్కింది. కడపటి సారి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత సమావేశం ప్రతి ఒక్కరి క్రియాశీల సానుకూల పాత్రపోషణ తో, అన్ని పక్షాల సహకారం తో మరియు గౌరవనీయులైన ఎంపీలు అందరి తోడ్పాటు తో ఇదివరకు ఎరుగనటువంటి కార్యసాధనల కు సాక్షి గా నిలచింది. మరి నేను ఈ యొక్క కార్యసిద్ధి ప్రభుత్వానికి చెందదు; ఇది అధికార పక్షాని కి చెందదు; ఇది యావత్తు సభ కు మరియు అందరు ఎంపీల కు చెందుతుంది అని బహిరంగం గా చెప్పడం పట్ల గర్వపడుతున్నాను. మరి అందుకనే నేను అందరు ఎంపీల కు వారి యొక్క క్రియాశీల సానుకూల పాత్రపోషణ కు గాను మరొక్క సారి నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. మరి ఈ సమావేశం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం గా మార్చడం లో కూడా సహాయకారి కాగలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రపంచం తో సమానమైనటువంటి వేగం తో పురోగమించే సామర్థ్యాన్ని పార్లమెంటు నుండి మనం వ్యక్తపరచి తీరాలి.
అన్ని అంశాల మీద దాపరికానికి తావు ఉండనటువంటి చర్చ జరగాలి అని మేము కోరుకొంటున్నాము. ఉత్తమమైన చర్చ ను జరపడం అవసరం. అది వాదోపవాదాలు కావచ్చు, ఒక తర్కం కావచ్చు, లేదా ఒక సంభాషణ కావచ్చు.. ప్రతి ఒక్కరు వారిదైన ప్రజ్ఞ ను దాని తాలూకు గరిష్ఠ స్థాయి లో వ్యక్తపరచాలి; మరి సభ లో చోటు చేసుకొనే చర్చ ను సుసంపన్నం చేయడం లో తోడ్పడాలి. దాని పర్యవసానం దేశాని కి ఉజ్జ్వల భవిత కై ఉపయోగపడుతుంది. కాబట్టి, అందరు ఎంపీల కు ఇవే నా శుభాకాంక్షలు పలుకుతూ మీ అందరి కీ కూడాను ఇవే నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
May the Winter Session of Parliament be a productive one. https://t.co/nsY4FNpxoW
— Narendra Modi (@narendramodi) November 18, 2019