Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ సాంవర్ లాల్ జాట్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


పార్లమెంట్ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ సాంవర్ లాల్ జాట్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘పార్లమెంట్ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ సాంవర్ లాల్ జాట్ కన్నుమూత వ్యథకు లోను చేసింది. ఆయన మృతి బిజెపి కి మరియు దేశ ప్రజలకు వాటిల్లినటువంటి భారీ నష్టం. ఆయన కుటుంబానికి ఇదే నా సంతాపం.

పల్లెవాసుల మరియు వ్యవసాయదారుల శ్రేయం కోసం శ్రీ సాంవర్ లాల్ జాట్ ఎంతగానో పాటుపడ్డారు. ఈ దు:ఖభరితమైన ఘడియలో ఆయన కుటుంబ సభ్యుల మరియు మద్దతుదారుల విషాదంలో నేను పాలు పంచుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

****