Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్ల‌మెంటు వ‌ర్ష కాల స‌మావేశాలు ప్రారంభం కావ‌డాని క‌న్నా ముందు ప్ర‌ధాన మంత్రి యొక్క ప్ర‌క‌ట‌న పాఠం

పార్ల‌మెంటు వ‌ర్ష కాల స‌మావేశాలు ప్రారంభం కావ‌డాని క‌న్నా ముందు ప్ర‌ధాన మంత్రి యొక్క ప్ర‌క‌ట‌న పాఠం


దేశం లోని ప‌లు అత్యవసర స‌మ‌స్య‌ల‌ను గురించి పార్ల‌మెంటు వ‌ర్ష కాల స‌మావేశాల‌లో విస్తృతంగా చ‌ర్చించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. చ‌ర్చ ఎంత కూలంకషంగా జ‌రిగితే, స‌భ లోని అనుభ‌వ‌జ్ఞులైన స‌భ్యుల వ‌ద్ద నుండి మరియు సీనియర్ ల నుండి అంత మెరుగైన సూచ‌న‌లు, స‌ల‌హాలు అందుతాయి; అలాగే వాటి నుండి దేశం కూడా చ‌క్క‌టి ప్ర‌యోజనాన్ని పొందగలుగుతుంది. ప్రభుత్వం కూడాను తన నిర్ణయాలలో మరియు విధానాలలో నాణ్య‌మైన స‌ల‌హాల‌ తాలూకు ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వచ్చు. ముఖ్య‌మైన ప‌నిని పూర్తి చేయ‌డం కోసం అన్ని రాజ‌కీయ ప‌క్షాలు స‌భ‌ల యొక్క కాలాన్ని గ‌రిష్ఠంగా వినియోగించుకొంటాయ‌ని నేను ఆశిస్తాను. ప్ర‌తి ఒక్క‌రూ కూడా సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తారు; మ‌రి పార్ల‌మెంట్ కార్య‌క‌లాపాలు ప్రేర‌ణాత్మ‌కంగా ఉంటాయని, రాష్ట్రాల చ‌ట్ట స‌భ‌ల‌కు కూడా ఇవి ఒక ఉదాహ‌ర‌ణ‌ ను అందిస్తాయ‌ని త‌లుస్తాను. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఈ ప‌నిని చేస్తాయ‌ని నేను ఆశిస్తాను. నేను నా ఆశ‌ల‌ను మ‌రియు ఆకాంక్ష‌ల‌ను ప‌దే ప‌దే వ్య‌క్తం చేశాను; మరియు వాటిని నెర‌వేర్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కూడా చేశాను. ఈసారి సైతం నేను మరొక్క మారు నా ఆశలను మీ ఎదుట వెల్ల‌డి చేస్తున్నాను. ఇందుకోసం మ‌న‌ం అంతా మ‌రొక్క‌ మారు పాటుప‌డాలి; మ‌రి మనం అలుపెర‌గ‌ని ప్ర‌య‌త్నాలు చేద్దాము. ఏ రాజ‌కీయ ప‌క్ష‌మైనా లేదా ఏ స‌భ్యుడైనా వారు కోరుకొన్న ఏ అంశం పైన అయినా సరే చ‌ర్చించేందుకు, వాదించేందుకు ప్ర‌భుత్వం సన్నద్ధంగా ఉంది. ఈ వ‌ర్షకాలం లో, దేశంలో కొన్ని ప్రాంతాల‌లో త‌గినంత వ‌ర్షం కుర‌వ‌కపోగా మరికొన్ని ప్రాంతాలలో భారీ వ‌ర్షాలు గంభీరమైన స‌వాళ్ళ‌ను రువ్వాయి. ఇటువంటి అంశాల‌ను గురించి చ‌ర్చిస్తే సంద‌ర్భశుద్ధి ఉంటుంద‌ని నేను న‌మ్ముతాను. అనేకానేక ధ‌న్య‌వాదాలు.

***