పిఎంఇండియా
సహచరులారా స్వాగతం.
ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. నూట ఇరవై అయిదు కోట్ల మంది భారతీయుల దృష్టి పార్లమెంట్ పైన, ఉభయ చట్ట సభల కార్యకలాపాల పైన, రైల్వే బడ్జెటు పైన, అలాగే సాధారణ బడ్జెటు పైన ఉంది.
ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం సంపాదించుకున్న స్థానం కారణంగా భారతదేశ బడ్జెటు సమావేశాల పైన మొత్తం ప్రపంచం ధ్యాస పెడుతోంది. గత కొద్ది రోజులుగా అన్ని రాజకీయ పార్టీలతోనూ అదే పనిగా సంప్రదింపులు సాగుతూ వస్తున్నాయి. కేవలం సంప్రదాయానికన్నా మించి ఆలోచనలు పంచుకోవడం, విమర్శల ప్రక్రియ చోటు చేసుకొంటోంది. ముఖాముఖి గా సైతం అనేక అంశాలపై మాటలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమయం సద్వినియోగం అవుతుందన్న, సార్ధకమైన చర్చలు జరుగుతాయన్న నమ్మకం నాకుంది. దేశంలోని సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షల గురించి లోతైన ఆలోచనలు జరుగుతాయనుకుంటా.
ఇంత వరకు జరిగిన సమావేశాలన్నింటిలోనూ ప్రతిక్షాల అనుచరులు సానుకూల వైఖరినే వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి మొదలవుతున్న సమావేశాలలోను, రానున్న రోజుల్లోను ఈ పరిణామం పూర్తి ప్రభావాన్ని దేశ ప్రజలు తప్పక చూస్తారు.
కూలంకషమైన చర్చల కోసం సభను ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వ లోటుపాట్లను సభలో ప్రస్తావించాల్సిందే..
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, జన బాహుళ్యం ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇదొక్కటే మార్గం.
సహచరులారా మీ అందరికీ ఇవే నా ధన్యవాదాలు..
***
As the Budget Session begins, my thoughts on having a productive Session. https://t.co/i1tfY8Yu3X
— Narendra Modi (@narendramodi) February 23, 2016