Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎమ్ ఎన్ ఆర్ ఎఫ్ లో భాగంగా ఎక్స్-గ్రేషియా విడుదల


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లోని మధుబని జిల్లా బెన్ని పట్టి సమీపంలో 19-9-2016 నాటి బస్సు ప్రమాదంలోను, అలాగే పంజాబ్ లో అమృత్ సర్ జిల్లా అట్టారీ వద్ద ముహవా గ్రామ సమీపంలో 20-9-2016 నాడు జరిగిన బస్సు ప్రమాదంలోను ప్రాణనష్టం వాటిల్లడంతో పాటు కొందరు గాయపడిన ఘటనలను గురించి తెలుసుకొని బాధపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ. 2 లక్షలు చొప్పున వారి సమీప బంధువులకు, తీవ్రంగా గాయపడిన వారికి అనుగ్రహ చెల్లింపు (ఎక్స్-గ్రేషియా) నిమిత్తం తలా రూ.50,000 వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ప్రధాన మంత్రి మంజూరు చేశారు.