Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పీఎం స్వనిధి యోజనకు ఆరు సంవత్సరాలు పూర్తి అయినట్లు పేర్కొన్న ప్రధానమంత్రి.. లబ్ధిదారులకు శుభాకాంక్షలు


పీఎం స్వనిధి యోజన గత ఆరు సంవత్సరాలుగా అమలవుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువచ్చారుదేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాల్లో మార్పు తేవడంలో ఈ పథకం ప్రముఖ పాత్రను పోషించిందన్నారు.
ఈ పథకం పూచీకత్తు లేకుండా రుణాన్ని అందుబాటులోకి వచ్చేటట్లు చూస్తోందనీఆర్థిక సేవలను అందరికీ చేరువ చేస్తోందనీఅసంఖ్యాకంగా ఉన్న వీధి వ్యాపారులకు కొత్త అవకాశాలను కల్పిస్తోందనీ ప్రధానమంత్రి అన్నారుపీఎం స్వనిధి యోజనను నమ్మకంఆత్మగౌరవంతో పాటు సాధికార ప్రధానంగా రూపుదిద్దారని ఆయన అన్నారు.
లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారువారి దృఢ సంకల్పాన్నీకష్టపడే తత్వాన్నీ ఆయన ప్రశంసించారువారి ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిరంతరం బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
పీఎం స్వనిధికి సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు మనం పండుగ చేసుకుంటున్నాంఈ పథకం పూచీకత్తు లేకుండా రుణాన్ని సమకూరుస్తూఆర్థిక సేవల్ని చెంతకు చేరుస్తూఅభివృద్ధికి కొత్త అవకాశాల్ని అందిస్తూ అసంఖ్యాకంగా ఉన్న వీధి వ్యాపారుల జీవితాల్లో పెనుమార్పుల్ని తీసుకువచ్చిందిఈ పథకం నమ్మకంఆత్మగౌరవంతో పాటు సాధికారత కల్పన ప్రధానంగా అమలవుతోందిఈ పథకం లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానువారి దృఢసంకల్పంకష్టపడే తత్వం మన దేశ ఆర్థిక వ్యవస్థను నిరంతరాయంగా పటిష్టపరుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

***