Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ మరియు అమృత్ ల ప్రథమ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి

పుణె లో స్మార్ట్ సిటీస్ మిషన్ మరియు అమృత్ ల ప్రథమ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పుణె లో జరిగిన స్మార్ట్ సిటీస్ మిషన్ మరియు అమృత్ ల ప్రథమ వార్షికోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి బాటలో పోటీ పడడానికి నగరాలు ముందడుగు వేయడమనే ఒక సరికొత్త ధోరణి ఇప్పుడు అగుపిస్తోందన్నారు. ప్రజా భాగస్వామ్యం అందిస్తున్న స్ఫూర్తి తో అభివృద్ధి పనులలో పోటీ పడే సకారాత్మక వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. నగరాలలోని ప్రజలు వారి వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకోవాలి, ఇటువంటి నిర్ణయాలు ఢిల్లీలో తీసుకొనేవి కావు అని ఆయన స్పష్టంచేశారు. భాగస్వామ్య తరహా పరిపాలన యొక్క స్ఫూర్తి అనేది కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

పట్టణీకరణ ను ఒక సమస్యగా భావించిన రోజులు ఇక సమసిపోయాయి; ఇప్పుడు దీనిని ఒక అవకాశంగా చూస్తున్నారు అని ప్రధాన మంత్రి చెప్పారు.

నగరాలు వృద్ధికి కేంద్రాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించగలిగే సామర్థ్యం వీటికి ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఘన వ్యర్ధాల నిర్వహణపై నగరాలు శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కిచెప్పారు

అంతక్రితం, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి విశాఖ పట్నం నుండి, ఒడిశా ముఖ్యమంత్రి భువనేశ్వర్ నుండి, రాజస్థాన్ ముఖ్యమంత్రి జైపూర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని వారి అభిప్రాయాలను సభికులకు వెల్లడించారు. ప్రధాన మంత్రి పుణె స్మార్ట్ నెట్ పోర్టల్ ను, పుణె స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ను ప్రారంభించారు. “Make Your City SMART” పోటీ ని కూడా ఆయన ప్రారంభించారు.