Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పునర్ వినియోగ ఇంధనంపై ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం

పునర్ వినియోగ ఇంధనంపై ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం

పునర్ వినియోగ ఇంధనంపై ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం

పునర్ వినియోగ ఇంధనంపై ప్రధాని రౌండ్ టేబుల్ సమావేశం


ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా శాన్జోస్ లో ఇంధన రంగానికి చెందిన సిఇఓ లు, నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి డాక్టర్ ఎర్నెస్ట్ మోనిజ్, ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ప్రొఫెసర్ స్టీవెన్ చూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

సన్ ఎడిషన్ సిఇఒ అహ్మద్ చాటిలా, సాఫ్ట్ బ్యాంక్ ప్రెసిడెంట్, సిఒఒ నికేష్ అరోరా, బ్లూమ్ ఎనర్జీ సిఇఒ కెఆర్ శ్రీధర్, సోలాజైమ్ సిఇఒ జోనాథన్ ఉల్ఫ్ సన్, వెంచర్ కాపిటలిస్ట్ జాన్ డియోర్, డిబిఎల్ పార్టనర్స్ ప్రతినిధి ఇరా ఎరెన్ప్రీస్, ఇంధన రంగానికి చెందిన ఉన్నత స్థాయి సిఇఒలు, ఇన్వెస్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు అరుణ్ మజుందార్, రోగర్ నాల్, డాక్టర్ అంజనీ కొచ్చార్, ప్రొఫెసర్ శాలీ బెన్సన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో అందరూ భారత్ స్వచ్ఛ ఇంధనాల రాజధానిగా మారుతుందని సమావేశంలో అందరూ ఏకాభిప్రాయం ప్రకటించారు.

విద్యుత్ నిల్వ చౌకగా మారడంతో స్వచ్ఛ, పునర్ వినియోగ ఇంధనం త్వరలోనే చౌకైన ఇంధనంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ ఇంధనాలకు తీసుకుంటున్న చొరవలో భారత్కు చెందిన రాష్ర్టాలు, నగరాలను భాగస్వాములను చేయాలని వారు సూచించారు. భారత్ నిర్దేశించుకున్న 175 గిగావాట్ల పునర్ వినియోగ ఇంధన సామర్థ్యాన్ని తట్టుకోగల సామర్థ్యం ప్రస్తుత గ్రిడ్కు లేదని, అందువల్ల గ్రిడ్ విస్తరణ దిశగా కూడా అనుబంధ చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచించారు. ఇందుకు ప్రైవేటు పెట్టుబడులు చాలా అవసరమని పేర్కొంటూ ప్రైవేటు పెట్టుబడులతోనే ఇజ్రాయిల్ నీటి కొరతను అధిగమించిందని వారు పేర్కొన్నారు.

భారత్ ప్రధానంగా టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఫైనాన్స్, నియంత్రణ వ్యవస్థలు, సరైన ప్రతిభను ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సలహా ఇచ్చారు. అలాగే దేశంలోని విద్యుత్ పంపిణీ కంపెనీల (డిస్కమ్ లు) ఆర్థిక స్థితి పట్ల కూడా వారు ఆందోళన ప్రకటించారు.

తమ తమ కంపెనీల వద్ద అందుబాటులో ఉన్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను, నవ్యతలను సిఇఒలు ప్రధానికి వివరించారు. స్వచ్ఛ ఇంధనాలకు పవన విద్యుత్, సౌర విద్యుత్, బయోమాస్ కూడా చక్కని సాధనాలని వారు వివరించారు.

సమావేశంలో పాల్గొన్న వారందరూ తమ తమ అభిప్రాయాలు తెలియచేసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. 175 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన లక్ష్యాన్ని సాధించాలన్న కట్టుబాటు భారత్కు ఉన్నదని ఆయన తెలిపారు. ఈ రంగంలో కూడా రైల్వే తరహాలోనే భారీ పెట్టుబడులకు అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. రైల్వేలో నూరు శాతం ఎఫ్డిఐలను తాము అనుమతిస్తున్న విషయం ఆయన గుర్తు చేశారు. నియంత్రణల వ్యవస్థ, డిస్కమ్ ల ఆర్థిక స్వస్థత మెరుగుపరచడం వంటి అంశాలపై కూడా తాము దృష్టి పెట్టామని ఆయన చెప్పారు.

పునర్ వినియోగ ఇంధన వనరుల విభాగంలో తీసుకున్న చొరవలను ఆయన సిఇఒలకు నివేదించారు. దేశంలో కోచి విమానాశ్రయం తొలి సోలార్ విద్యుత్తో నడిచే విమానాశ్రయంగా మారిందని, గుజరాత్లోని ఒక కాలువ వెంబడి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని ప్రధాని తెలియచేశారు. వచ్చే నెలలో జార్ఖండ్లోని ఒక జిల్లా కోర్టు పూర్తి సోలార్ పవర్తో పని చేసేదిగా మారుతున్నట్టు ఆయన చెప్పారు. కోల్ గాసిఫికేషన్ కూడా ఒక కీలకమైన పరిశోధనాంశమని ఆయన సూచించారు. వచ్చే దశాబ్ది పునర్ వినియోగ ఇంధన విప్లవానికి ప్రతీకగా నిలుస్తుందన్న నమ్మకం ఆయన ప్రకటించారు.