పిఎంఇండియా
భారత్ అమలు చేస్తున్న మిషన్ లైఫ్ (పర్యావరణానుకూల జీవనశైలి) పురాతన నీటి సంరక్షణ పద్ధతుల్ని పునరుజ్జీవింప చేస్తున్న తీరును వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. తమిళనాడులోని ఎరీ ట్యాంకు వ్యవస్థలు, రాజస్థాన్‌లోని జోహాడ్ల గురించి వ్యాసంలో ప్రస్తావించారు. భూగ్రహానికి సేవ చేయడానికి ఉద్దేశించిన కార్యకలాపాలుగా పునర్నిర్వచించారు. ‘‘వాస్తవిక సంరక్షణ సంప్రదింపులతో కాక, సంరక్షించుకోవడంతో మొదలవుతుందంటూ భారత్ ఇస్తున్న సందేశమని ఆయన వివరించారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.
‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ –
‘‘తమిళనాడులోని ఎరీ ట్యాంకుల నుంచి రాజస్థాన్‌లోని జోహడ్‌ల వరకు.. పురాతన నీటి సంరక్షణ పద్ధతుల్ని భారత్ అమలు చేస్తున్న మిషన్ లైఫ్ (పర్యావరణానుకూల జీవనశైలి) పునరుద్ధరిస్తోందనీ, వాటిని భూగ్రహానికి సేవ చేయడానికి ఉద్దేశించిన కార్యకలాపాలుగా పునర్నర్వచిస్తోందనీ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ చెబుతున్నారు. చదివితీరాల్సిన వ్యాసమిది.
‘‘వాస్తవిక సంరక్షణ సంప్రదింపులతో కాక, సంరక్షించుకోవడంతో మొదలవుతుందంటూ భారత్ ఇస్తున్న సందేశమని ఆయన వివరించారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
In this must-read article, Union Minister Shri @byadavbjp writes that India's Mission LiFE (Lifestyle For Environment) revives time-honoured conservation practices, from Tamil Nadu's eri tank systems to Rajasthan's johads, reframing them as conscious acts of planetary service.… https://t.co/sE4WICBgFl
— PMO India (@PMOIndia) November 4, 2025