పిఎంఇండియా
105 చట్టాల రద్దుకుగాను ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్, 2017కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
పూర్వ రంగం:
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ), ది లా కమిషన్ ఆఫ్ ఇండియా, ది లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ లు ఏర్పాటు చేసిన ద్విసభ్య సంఘం మన చట్టాలలో 1824 చట్టాలు పురాతనమైనవని, పనికిరానివని గుర్తించి, వాటిని రద్దు చేయాలంది. కేంద్ర ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖల తోను, విభాగాలతోను ఎంతో శ్రద్ధగా సంప్రదింపులు జరిపి, చాలా జాగ్రత్తగా పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో (మే, 2014 నుండి ఆగస్టు 2016 కాలంలో ) నాలుగు చట్టాలను చేసింది. వాటి ద్వారా 1175 కేంద్ర చట్టాలను రద్దు చేయాలని భావించింది.
1. రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్, 2015 (17 ఆఫ్ 2015) ద్వారా 35 చట్టాల రద్దు. ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ (సెకండ్) యాక్ట్, 2015 ( 19 ఆఫ్ 2015 )ద్వారా 90 చట్టాల రద్దు;
2. అప్రప్రొయేషన్ చట్టాలు (రద్దు) యాక్ట్, 2016 ( 22 ఆఫ్ 2016) ద్వారా 756 చట్టాల రద్దు;
3. అప్రప్రొయేషన్ (రైల్వేలు) చట్టాలతో కలిపి అప్రప్రొయేషన్ చట్టాలు;
4. రిపీలింగ్ అండ్ అమెండింగ్ యాక్ట్ , 2016 ( 23 ఆఫ్ 2016) ద్వారా 294 చట్టాల రద్దు;
పైన తెలియజేసిన 1824 చట్టాలలో 227 చట్టాలను ( రాష్ట్రపతి పాలన కింద రాష్ట్రాల కోసం పార్లమెంటు చేసిన అప్రప్రొయేషన్ చట్టాలతో కలిపి) రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాల్సినవిగా గుర్తించడం జరిగింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు మిగిలిన 422 చట్టాల జాబితాను ఇచ్చి వాటి రద్దు విషయంలో వారి వ్యాఖ్యలను కోరడమైంది. ఇంతవరకు లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్‌తో కలిపి 73 మంత్రిత్వశాఖలు/విభాగాలు వాటి వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. 105 చట్టాలను రద్దు చేయాలని అవి అంగీకరించాయి. 139 చట్టాల రద్దు విషయంలో అంగీకారం తెలపలేదు. మంత్రిత్వ శాఖలు/ విభాగాలు ఇచ్చిన వ్యాఖ్యలు/సమ్మతి ప్రకారం 105 చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.