Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పురుషుల 77 కిలోగ్రాముల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకొన్న శ్రీ స‌తీశ్ కుమార్ శివ‌లింగమ్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


కామ‌న్‌వెల్త్ గేమ్స్ లో బంగారు ప‌త‌కాన్ని వెయిట్‌లిఫ్టర్ గెలుచుకొన్న శ్రీ స‌తీశ్ కుమార్ శివ‌లింగమ్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

‘‘భార‌త‌దేశానికి చెందిన వెయిట్‌లిఫ్ట‌ర్లు ప‌త‌కాల ప‌ట్టిక‌లో మ‌న స్థానాన్ని కూడా పైకి ఎత్తారు. శెభాష్ స‌తీశ్ కుమార్ శివ‌లింగమ్.. 77 కిలోగ్రాముల వెయిట్‌లిఫ్టింగ్ కేట‌గిరీ లో స్వ‌ర్ణాన్ని సాధించారు. వరుస‌గా రెండు కామ‌న్‌వెల్త్ గేమ్స్‌ లో.. 2014 గ్లాస్ గో గేమ్స్ తో పాటు 2018 గోల్డ్ కోస్ట్ లో.. పసిడి ప‌త‌కాల‌ను కైవ‌సం చేసుకోవ‌డం ద్వారా చ‌రిత్ర పుట‌ల‌కెక్కారు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***