Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పృథ్వి దినం నాడు ఒక శ్రేష్ఠ‌త‌ర‌మైన భూ గ్ర‌హాన్ని ఆవిష్క‌రించే దిశ‌గా వ‌చ‌నబ‌ద్ధ‌త‌ ను పున‌రుద్ఘాటించిన ప్ర‌ధాన మంత్రి


‘‘మ‌న భావి త‌రాల వారి కోసం ఒక శ్రేష్ఠ‌త‌ర‌మైన భూ గ్ర‌హాన్ని ఆవిష్క‌రించే దిశ‌గా మ‌న వ‌చ‌న‌బ‌ద్ధ‌త‌ ను పృథ్వి దినం సందర్భంగా పున‌రుద్ఘాటిద్దాం. జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న భయాన్ని త‌గ్గించేందుకు మ‌నమంతా క‌ల‌సి పాటుపడదాం. ఇది మ‌న ప్రియ‌మైన పృథ్వి మాత‌ కు మనం అందజేసే ఓ గొప్ప కృత‌జ్ఞ‌త‌ కాగ‌ల‌దు.

ప్ర‌కృతి తో సామ‌ర‌స్యాన్ని ప్రోత్స‌హించే దిశగాను, మ‌న‌గ‌లిగే అభివృద్ధి లక్ష్యంగాను చొర‌వ తీసుకొంటున్న వ్య‌క్తులకు మ‌రియు సంస్థ‌ల‌కు ఇవే నా అభినంద‌న‌లు’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

*****