Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌరులకు స్పష్టమైన ఫలితాలనిచ్చే పాలన ప్రాధాన్యతను వివరిస్తూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


బీహార్ మాజీ ముఖ్యమంత్రిరాజ్యసభ సభ్యుడు శ్రీ నితీశ్ కుమార్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా వరుసగా అత్యధిక కాలం భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎం నరేంద్ర మోదీని ఈ కథనం ప్రశంసించిందిఅత్యయిక స్థితి నాటి పోరాటాలను గుర్తు చేస్తూ… ప్రభుత్వం సాధించిన ఎన్నో విజయాలను వివరించిందిపౌరులకు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటమే పీఎం మోదీ నాయకత్వంలోని పాలన లక్షణమని పేర్కొంది.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రిరాజ్యసభ ఎంపీ శ్రీ నితీశ్ కుమార్ రాసిన ఈ కథనం.. ప్రజాస్వామ్యయుతంగా వరుసగా అత్యధిక కాలం భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎం నరేంద్ర మోదీని అభినందించిందిఎమర్జెన్సీ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను ఈ కథనం ద్వారా గుర్తు చేశారుఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఎన్నో విజయాలను ప్రస్తావించటంతో పాటు పౌరులకు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటమే పీఎం మోదీ నాయకత్వంలోని పాలన లక్షణమని శ్రీ నితీశ్ కుమార్ పేర్కొన్నారు“.

***