Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌరులు ఓర్పుతో, క్రమబద్ధమైన రీతిలో నోట్ల ను మార్చుకొంటుండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు;


రూ.500, రూ.1,000 ముఖ విలువ కలిగిన బ్యాంకు నోట్లు న్యాయసమ్మతమైన ద్రవ్యంగా చెలామణి కావడాన్ని రద్దు చేయడంతో ఆ నోట్లను పౌరులు

బ్యాంకులలో ఇచ్చి మార్చుకోవడంలో ఓర్పును కనబరుస్తూ, ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తున్న తీరు పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విశాల హితం కోసం ఈ పరిమితకాలపు అసౌకర్యాన్ని భరించడం కోసం పౌరులు చాటుతున్న ఈ తరహా స్నేహశీలత, ఉత్సాహపూరిత, సహనశీల స్వభావాన్ని గమనించడం ధైర్యపరుస్తోందని ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు. అవినీతికి తావు లేని భారతదేశాన్ని ఆవిష్కరించే, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి అందేటట్లు చూసే ప్రయత్నంలో ప్రభుత్వం దృఢంగా ఉన్నట్లు ఆయన హామీని ఇచ్చారు.

“బ్యాంకర్లకు పౌరులు వారి కృత‌జ్ఞ‌త‌లను వ్యక్తం చేస్తున్నారని, చాలా ఓర్మితో, ఒక క్రమ పద్ధతిలో నోట్లను మార్చుకొంటున్నారని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది.

వయోవృద్ధులు రొక్కాన్ని తీసుకోవడానికి, వారి కరెన్సీని మార్చుకోవడానికి వారికి సహకరించేందుకు ప్రజలు చురుకుగా ముందుకు వస్తున్నారని తెలుసుకోవడం సైతం ఉత్సాహాన్నిస్తోంది.

విశాల హితం కోసం కొంత కాలం పాటు అసౌకర్యాన్ని భరించగలిగిన ఇటువంటి ఆదరపూర్వక వైఖరి, ఉత్సుకత మరియు సహనశీలతలు నిజంగా ఎంతో ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి.

అవినీతికి చోటు లేని, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి అందే భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం దృఢంగా ఉంది అని చెప్పి మీకు నేను హామీని ఇస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.