Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పౌర విమానయాన సంబంధిత భద్రత పై సహకారాన్ని పెంపొందించుకొనేందుకుగాను భారతదేశానికి, ఆస్ట్రేలియా కు మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పౌర విమానయాన సంబంధిత భద్రత పై సహకారాన్ని పెంపొందించుకొనేందుకుగాను భారతదేశానికి, ఆస్ట్రేలియా కు మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)కు ఆమోదం తెలిపింది.

భారతదేశ విమానయాన భద్రత సంబంధ అధికారులు వారి అనుభవాన్ని తమ ఆస్ట్రేలియా అధికారులతో పంచుకొనేందుకు అంతే కాకుండా, భారతదేశంలో విమానయాన భద్రత సంబంధ చర్యలను విస్తరించేందుకు కూడా ఈ ఎమ్ఒయు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.

అంతర్జాతీయ స్థాయిలో నిర్వర్తించవలసిన కర్తవ్యాలను పాటించేందుకు, దానితో పాటే ఉభయ దేశాల మధ్య భద్రతపరమైన సహకారాన్ని విస్తరించుకొనేందుకు ఈ ఎమ్ఒయు తోడ్పడనుంది.

***